పల్లవి :
నీవు రావు నిదురరాదు (2)
నిలిచిపోయే ఈ రేయి
నీవు రావు నిదురరాదు
చరణం : 1
తార జాబిలి ఒకటై
సరసమాడె ఆ రేయి...
చింత చీకటి ఒకటై
చిన్నబోయె ఈ రేయి
నీవు రావు...
చరణం : 2
ఆశలు మదిలో విరిసె
దోసిట విరులై కురిసే
ఆలయాన చేరి చూడ...
ఆలయాన చేరి చూడ
స్వామికానరాడాయె
నా స్వామికానరాడాయె
చరణం : 3
కౌగిలిలో ఒదిగిపోయి
కలలుగనే వేళాయే
ఎదురుచూసి ఎదురుచూసి (2)
కన్నుదోయి అలసిపోయె
చిత్రం : పూలరంగడు (1967)
రచన : దాశరథి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి.సుశీల
No comments:
Post a Comment