బహుశా ఓ చంచలా
ఎగిరే రాయంచలా
తగిలేలే మంచులా చూపులో చూపుగా
ఐనా కావచ్చులే ఒకటైపోవచ్చులే
ఇలపై ఆకాశమే ఇకపై వాలొచ్చులే
ఏ దూరమైనా చేరువై (బహుశా)
కనుపాపల్లో నిదురించి
కలదాటింది తొలిప్రేమ
తొలిచూపుల్లో చిగురించీ
మనసిమ్మందీ మన ప్రేమ
కలగన్నాను కవినైనాను నిను చూసి
నిను చూశాకే నిజమైనాను తెర తీసి
బహుశా ఈ ఆమనీ పిలిచిందా రమ్మనీ
ఒకటైతే కమ్మనీ పల్లవే పాటగా
నాదిరి దిరి దిరి దిరి దిరి దిరి
దిరి దిరి దిరి
తోందిరి దిరి దిరి దిరి దిరి దిరి
దిరి దిరి దిరి (నాదిరి)(౩)
నాదిరి తోందిరి నాదిరి తోందిరి
నాదిరిదీమ్(౩)
అలలై రేగే అనురాగం
అడిగిందేమో ఒడిచాటు
ఎపుడో ఏదో అనుబంధం
తెలిసిందేమో ఒకమాటు
మధుమాసాలే మన కోసాలై ఇటు రానీ
మన ప్రాణాలే శతమానాలై జత కానీ
తొలిగా చూశానులే చెలిగా మారానులే
కలలే కన్నానులే కలిసే వున్నానులే
నా నీవులోనే నేనుగా....(బహుశా)
No comments:
Post a Comment