Wednesday, December 15, 2010

‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రం కోసం 1966 డిసెంబరు 15న (ఇదే రోజు) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడిన మొదటిపాట రికార్డింగ్ జరిగింది.

పల్లవి : నా పేరు బికారి నా దారి ఎడారి
మనసైన చోట మజిలీ
కాదన్న చాలు బదిలీ
నా దారి ఎడారి నా పేరు బికారి (2)

చరణం : 1
తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను
పాట నాకు సైదోడు పక్షి నాకు తోడు
విసుగు రాదు ఖుషీ పోదు
వేసట లేనేలేదు (2)
అసలు నా మరోపేరు ఆనంద విహారి ॥దారి॥

చరణం : 2
మేలుకొని కలలుగని మేఘాల మేడపై
మెరుపుతీగలాంటి
నా ప్రేయసినూహించుకొని
ఇంద్రధనసు పల్లకీ ఎక్కి
కలుసుకోవాలని (2)
ఆకాశవీధిలో పయనించు బాటసారి ॥దారి॥

చరణం : 3
కూటికి నే పేదను
గుణములలో పెద్దను
కూటికి నే పేదను
గుణములలో పెద్దను
సంక ల్పం నాకు ధనము
సాహసమే నాకు బలం
ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు
ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు
అంతవరకు నేనొక నిరంతర సంచారి ॥దారి॥

చిత్రం : శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ (1976)
(దర్శకత్వం : బాపు)
రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

గమనిక : ఎస్.పి.కోదండపాణి స్వరకల్పనలో ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రం కోసం 1966 డిసెంబరు 15న (ఇదే రోజు) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడిన మొదటిపాట రికార్డింగ్ జరిగింది.

No comments: