పల్లవి :
బోటనీ పాఠముంది
మ్యాటనీ ఆట ఉంది
దేనికో ఓటు చెప్పరా
హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది
సోదరా ఏది బె స్టురా
బోటనీ క్లాసంటే బోరు బోరు
హస్టరీ రొస్టు కన్నా రెస్టు మేలు
పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు
బ్రేకులు డిస్కోలు చూపుతారు
జగడ జగడ జగడ జగడజాం (4)
చరణం :
1 దువ్వెనే కోడిజుత్తు నవ్వెనే
ఏడ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు
ఎవ్వరీ వింత గరీబు
జోరుగా వచ్చాడే జేమ్స్‌బాండు
గీరగా వేస్తాడే ఈల సౌండు
నీడలా వెంటాడే వీడి బ్రాండు
ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు
జగడ జగడ జగడ జగడజాం... (4)
చరణం : 2
అయ్యో... మార్చినే తలచుకుంటే
మూర్ఛలే ముంచుకొచ్చె
మార్గమే చెప్పు గురువా...
ఆ... ఛీ... తాళం రాదు మార్చిట మార్చి
తాళంలో పాడరా వెధవా
కొండలా కోర్సువుంది ఎంతకీ
తగ్గనంది ఏందిరో ఇంత గొడవ
ఎందుకీ హైరానా వెర్రినాన్నా
వెళ్లరా సులువైన దారిలోనా
ఉందిరా సెప్టెంబర్ మార్చిపైనా
హోయ్ వాయిదా పద్ధతుంది దేనికైనా
చరణం : 3
మ్యాగ్జిమమ్ మార్కులిచ్చు
మ్యాథ్స్‌లో ధ్యాసవుంచు
కొద్దిగా ఒళ్ళు వంచరా ఒరేయ్...
తందనా తందననన్ తందనా
తందననన్ తందనా తందననన్నా
క్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫుపై పెట్టుకాస్త ఫస్ట్ ర్యాంక్ పొందవచ్చురో॥
అరె ఏం సార్...
లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్ళు
లక్కుతోని లచ్చలల్ల్ల మునిగిపోతరు
పుస్కాల్తో కుస్తీలు పట్టెటోళ్ళు
సర్కారీ క్లర్కులై మురిగిపోత రు
జగడ జగడ జగడ జగడజాం... (4)
చిత్రం : శివ (1989)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా
గానం : బాలు, శైలజ, బృందం
No comments:
Post a Comment