పల్లవి :
చీకటి వెలుగుల రంగేళీ
జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి
అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల
ఆశల వెలిగించు దీపాల వెల్లి
చరణం : 1
అక్కయ్య కన్నుల్లో మతాబులు
ఏ చక్కన్ని బావకో జవాబులు
మాటల్లో వినిపించు చిటపటలు (2)
ఏ మనసునో కవ్వించు గుసగుసలు
చరణం : 2
అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్ళకు
మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్ళకు
బావా బావా పన్నీరు
బావను పట్టుక తన్నేరు (2)
వీధి వీధి తిప్పేరు
వీసెడు గుద్దులు గుద్దేరు
చరణం : 3
అమ్మాయి పుట్టింది అమాస నాడు
అసలైన గజదొంగ అవుతుంది చూడు
పుట్టినరోజున దొరికాడు తోడు (2)
పున్నమి నాటికి అవుతాడు జోడు
చిత్రం : విచిత్రబంధం (1972)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల, పి.సుశీల
No comments:
Post a Comment