Tuesday, December 14, 2010

KOLUVAI VUNNADE(SWARNA KAMALAM)

కంటేనాలంబయేత్ గీతం
హస్తేనా అర్ధం ప్రదర్శయేత్
చక్షుభ్యాం దర్శయేత్ భావం
పాదాభ్యాం తలం ఆచరేత్

కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే(2)
వలరాజు పగవాడే
వనిత మోహనాంగుడే(2)
కొలువై ఉన్నాడే

పలు పొంకమగు చిలువల
కంకణములమర
నలు వంకల మణిరుచులవంక తనర(౩)
తలవంకనలవేలు
తలవంకనలవేలు కులవంక నెలవంక(2)
వలచేత నొసగింక వైఖరి మీరంగ
కొలువై ఉన్నాడే...........

మేలుగా రతనంపు రాలు చెక్కిన ఉంగరాలు
భుజగ కేయూరాలు మెరయంగ(2)
పాలు గారు మోమున శ్రీలు పోదామా(2)
పులి తోలు గట్టి ముమ్మొన
వాలు బట్టి చెదర
కొలువై ఉన్నాడే......

No comments: