శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
ఈ నా కృతి నీవు భారతి
ఈ నా కృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
ద్రుతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతి
ద్రుతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతి
శరణా గతి నీవు భారతి
నీ పదములొత్తిన పథము ఈ పథము నిత్యకైవల్య పథము
నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు
కోరినా మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప
చేరినా ఇక చేరు ఉన్నతేది నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప
శ్రీ నాధ కవి నాధ శృంగార కవితా తరంగాలు నీ స్పూర్తులే
అల అన్నమాచర్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే
శ్రీ నాధ కవి నాధ శృంగార కవితా తరంగాలు నీ స్పూర్తులే….
అల అన్నమాచర్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే
త్యాగయ్య గళసీమ రావిల్లిన అనంత రాగాలు నీ మూర్తులే
నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం జననీ భవతారక మంత్రాక్షరం
No comments:
Post a Comment