చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా(2)
బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి
ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ(చుట్టూ)
తెల్ల చీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మ
నల్ల చీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మ
ఎర్ర చీర కట్టుకుంటే సందె పొద్దు నువ్వమ్మా
పచ్చ చీర కట్టుకుంటే పంట చేను సిరివమ్మా(చుట్టూ)
నేరేడు పళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు
ఊరించే ఊహల్లో దోలాడే పరవళ్ళు
వంగపండు రంగులోన పొంగుతాయి సొగసుల్లు
వన్నె వన్నె చీరల్లోన నీ ఒళ్ళే హరివిల్లు(చుట్టూ)
No comments:
Post a Comment