నీ కళ్ళతోటి నా కళ్ళలోకి
చూస్తేనే చంద్రోదయం
నీ చూపు తోటి నను తాకుతుంటే
తనువంతా సూర్యోదయం
ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే
క్షణాలే కదా ఓ వరం
అలాగే అలాగే ప్రపంచాలు పలికే
కథవ్వాలి మనమిద్దరం(నీ కళ్ళతోటి)
అడుగునౌతాను నీ వెంట నేను
తోడుగా నడవగా చివరి దాకా
గొడుగునౌతాను ఇకపైన నేను
వానలో నిన్నిలా తడవనీక
నిన్నొదిలి క్షణమైన అసలుండలేను
చిరునవ్వునౌతను పెదవంచున
నీ లేత చెక్కిళ్ళ వాకిళ్ళలోనే
తోలి సిగ్గు నేనవ్వనా(నీ కళ్ళతోటి)
వెన్నెలౌతాను ప్రతి రేయి నేను
చీకటే నీ దరికి చేరకుండా
ఊపిరౌతను నీలోన నేను
ఎన్నడూ నీ జతే వదలకుండా
నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ
నేనుండిపోతాను పారాణిలా
చిరు చెమట పడుతుంటే
నీ నుదుటిపైన వస్తాను చిరుగాలిలా
No comments:
Post a Comment