Tuesday, December 14, 2010

(ఆకుచాటు)AAKU CHATU PINDE TADISE(VETAGADU(1979))

ఆకుచాటు పిందె తడిసె...
కొకమాటు పిల్ల తడిసె...(2)
ఆకాశ గంగొచ్చింది
అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది
కొంగుల్ని ముడి పెట్టింది
గుడు చాటు గువ్వ తడిసె..
గుండె మాటు గుట్టు తడిసె..(2)(ఆకాశ)

ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే
చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే
ఓ చినుకు నిను తాకి తడియారిపోతుంటే(2)
ఓ చినుకు నీ మెడలో నగలాగ నవ్వుతుంటే
నీ మాటవిని మబ్బు మెరిసి...ఆహా....
జడివానలే కురిసి కుదిపి
ఒళ్ళు తడిసి వెల్లివిరిసి
వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి
అహ అహ ఆహా...అహ అహ ఆహా...(ఆకుచాటు)

మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే
ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే ఆహా...
నీ పాటవిని మెరుపులొచ్చి ఆహా...
నీ విరుపులే ముడుపులిచ్చి
చలిని పెంచి చెలిమి పంచి
కలలు వెచ్చంగ తడి ఆర్చుకోవాలి
అహ అహ ఆహా....
అహ అహ హాహా....(ఆకుచాటు)

No comments: