Friday, December 10, 2010

చిత్రం : మామగారు (1991) రచన : సిరివెన్నెల సంగీతం : రాజ్-కోటి గానం : బాలు, స్వర్ణలత, బృందం

పల్లవి :
ఇయ్యాలె అచ్చమైన దీపావళి
వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి

ఏనాడు ఎళ్లిపోని దీపావళి
ఏరి కోరి ఎంచుకొంది మా లోగిలి
ఏల ఏల చుక్కల్లో
యెలుగలన్ని యెదజల్లి
మా ఇంట యెలిశాడు ఆ జాబిలి
ఏల....

చరణం : 1
అలాంటిలాంటిటోడుగాదు
మా అల్లుడుగారు
కోటికొక్కడుంటాడా
ఇలాంటి మంచివాడు
కొండంత పెద్ద మనసు కలిగినోడు
గోరంత పేదగూటికొచ్చినాడు
కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకల్లే కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకల్లే
ఇట్టాంటి అల్లుడొస్తే ప్రతి అమాస
ఆ ఇంటి దీపాళి పండగంట

చరణం : 2
మాయ మర్మం లేనివాడు
మా మామగారు
మట్టిలోని మాణిక్యం మా ఆడవారు
గుండెల్లోన పెంచినాడు
నన్ను కన్నవాడు
గుండెను గుడి చేస్తాడు కట్టుకున్నవాడు
మమకారమన్నది ఇంటి పేరు
పెట్టి పుట్టనోళ్లు దీన్ని పొందలేరు
సిరులేవీ కొనలేనిది సరిలేని ఈ పెన్నిధి
ఇట్టాంటి నవ్వులుంటె ప్రతి అమవాస
ఆ ఇంటి దీపావళి పండగంట

చిత్రం : మామగారు (1991)
రచన : సిరివెన్నెల
సంగీతం : రాజ్-కోటి
గానం : బాలు, స్వర్ణలత, బృందం

No comments: