Friday, December 10, 2010

చిత్రం : యువరత్న (2002) రచన : చంద్రబోస్ సంగీతం : ఎం.ఎం.కీరవాణి గానం : కళ్యాణిమాలిక్, సాధనా సర్గమ్

పల్లవి : సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా 
చిరు చిరు నవ్వే నవ్వవా ॥
నీ చిరు చిరు నగవుల కిలకిల సడితో 
వలపుల పాటలు పాడవా
వలపుల తెలుగుల తొలి పిలుపులలో 
చెలిమికి నా మది చూపవా
॥॥చిరు చిరు॥

చరణం : 1
ఏ తోటలో ఏ కొమ్మకో 
తారల్లే విరిసిన పువ్వా
నాదో కోరిక వినవా 
తన సిగలో జాబిలి కావా
వేసంగిలో వెన్నెల్లలో గువ్వల్లె 
మెరిసిన పువ్వా
నాలా నువ్వైపోవా 
తన ఒడిలో పాపవుకావా
పసిపసి మనసుల మొరలను వినవా 
మధురిమ మంత్రం వేయవా
మా పరుగుల ఉరుకుల ప్రేమల త్రోవ 
పరిమళ భరితం చేయవా ॥

చరణం : 2
ముత్యానికే ముస్తాబులా తెల్లంగ 
పూచిన పూవా నాతో ఏకం కావా
హోయ్... హోయ్...
తన పదములు పూజకు రావా... హోయ్... హోయ్...
గోదారికే పైటంచులా 
స్వచ్ఛంగా విచ్చిన పూవా
నాలో సిగ్గును కనవా
నా తేనెలు తనకందీయవా
ఇటు అటు తెలియని వయసుల గొడవ 
ఇది అని నువ్వే తేల్చవా
మా ఇరువురి నడుమన వారధి కావా 
ఈ ఒక సాయం చేయవా ॥

చిత్రం : యువరత్న (2002)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : కళ్యాణిమాలిక్, సాధనా సర్గమ్

No comments: