పల్లవి : శీత వేళ రానీయకు... రానీయకు శిశిరానికి చోటీయకు... చోటీయకు వేళ... ఎద లోపల పూలకారు ఏనాటికీ... పోనీయకు... వేళ... చరణం : 1 ఉగ్రమైన వేసంగి గాడ్పులు ఆగ్రహించి పై బడినా అదిరి పోవకు అదిరి పోవకు... ఒక్కుమ్మడిగా వర్షామేఘం వెక్కివెక్కి రోదించినా లెక్క చేయకు... లెక్క చేయకు... వేళ.... చరణం : 2 చైత్రంలో తొగరెక్కిన కొత్త కోర్కెలు శరత్తులో కెపైక్కే తీయని కలలు మనసారా తీర్చుకో మనుగడ పండించుకో లోకానికి పొలిమేరను నీ లోకం నిలుపుకో వేళ... చరణం : 3 ఉదయాన కలత నిదర చెదిరిపోవువేళ మబ్బులలో ప్రతి తారక మాయమయే వేళ ముసలి తనపుటడుగుల సడి ముంగిట వినబడేనా (2) వీట లేడనీ చెప్పించు వీలు కాదనీ పంపించు వేళ... చిత్రం : మేఘసందేశం (1982) రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి సంగీతం : రమేష్‌నాయుడు గానం : పి.సుశీల, కె.జె.ఏసుదాస్ |
Friday, December 10, 2010
చిత్రం : మేఘసందేశం (1982) రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి సంగీతం : రమేష్‌నాయుడు గానం : పి.సుశీల, కె.జె.ఏసుదాస్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment