Friday, December 10, 2010

చిత్రం : ప్రేమతో (1998) రచన : సిరివెన్నెల సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ గానం : సుఖ్వీందర్ సింగ్, శుభ

పల్లవి :ఛల్ ఛయ్య ఛయ్య ఛ య్యా ఛయ్యా
ఛల్ ఛయ్య ఛయ్యా ఛ య్యా ఛయ్యా
ఛయ్య ఛయ్యా ఛ య్యా ఛయ్యా ॥

చెలి కిలకిలలే చిటికెయ్య హొయ్య
చెలి కిలకిలలే చిటికెయ్య
మది చెదిరి కథాకళి చెయ్య హొయ్య
మది చెదిరి కథాకళి చెయ్య ॥

చరణం : 1
ఓ కన్నియపై చూపున్నదయా
ఎదుటపడే చొరవుండదయా
మనసాప లేక మాటాడ లేక
ఒక ఖయ్యామై తయారయ్యా ॥

చరణం : 2
గుమ్మంటు గుబాళిస్తున్నదయా
ప్రతిచోట తనే అంటున్నదయా ॥
తన వెంటపడే నా మనవి విని 
ఏనాటికి కనిపించేనయ్యా (2) ॥
తొలగేనా మరీ ఈ మాయ తెర
తన చెలిమి సిరి నా కలిమి అని
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి (4)
జాలి పడైనా ఆ అనదే
మర్యాదకైన పరదా విడదే
అపరంజి చిలక శ్రమపడిన ఫలితమై
నావెపై వస్తూ ఉన్నదయా
చెలి కిలకిలలే చిటికెయ్య హొయ్య (2) ॥

చరణం : 3
మదినూయలలూపే సొగసయ్యా
తొలి తూర్పు కాంతులే చెలి ఛాయ
పరువాల తరంగమె తానయ్యా
మహరాణి రూపు హరివిల్లయ్యా (2)
ఎంతటి అలకే కిన్నెరసాని 
మావని చేరే అల్లరిమాని (2)
చెప్పరయ్య నా జాణ తోటి
తన జంటపడే దారేదయ్యా ॥

చిత్రం : ప్రేమతో (1998)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : సుఖ్వీందర్ సింగ్, శుభ

No comments: