Tuesday, December 14, 2010

SUSWAGATAM NAVARAGAMAA(SUSWAGATAM)

సుస్వాగతం నవరాగామా
పలికిందిలే ఎద సరిగమ
ప్రియ దరహాసమా ప్రేమ ఇతిహాసమా
నీ తొలి స్పర్శలో ఇంత సుఖ మైకమా
ఇది ప్రణయాలు చిగురించు శుభ తరుణమా

(చిన్నారి రాణి పువ్వా చిన్ని చిన్ని నవ్వులివ్వ
నీ కోసం ప్రాణం పెట్టె చిన్నవాణ్ణి చేరవా)

అంతేలేని వేగంతోనే ప్రేమే వస్తుంటే
నేను ఆనకట్ట వేయలేనే ఆహ్వానిస్తుంటే
పట్టే తప్పే విరహంలోనే మునిగిపోతుంటే
ఇంక క్షేమంగానే జీవిస్తా నీ చెయ్యందిస్తుంటే
చేతులే నీకు పూల దండగా
మెడలోన వేసి నీ జంట చేరనా
నా చూపు సూత్రంగా ముడిపడగా
నాజూకు చిత్రాల రాజ్యమేలనా
మౌనమే మాని గానమై పలికే నా భావన

(శిలలాంటి గుండె కోసం శిల్పమల్లె మారిపోయే
చిత్రాల ప్రేమ చోద్యం చక్కనైన వేళల్లో)

సూరిడున్నాడమ్మ నిన్నే చూపడానికి
రేయి వున్నాదమ్మ కలలో నిన్నే చేరడానికి
మాట మనసు సిద్దం నీకే ఇవ్వడానికి
నా కళ్ళు,పెదవి ఉన్నాయ్ నీతో నవ్వడానికి
ఏనాడో చూశాను రూపు రేఖలు
ఆనాడే రాశాను చూపు లేఖలు
రోజు లేవమ్మ ఇన్ని వింతలు
వేళ నా ముందు ప్రేమ పుంతలు
ఏడు వింతలను మించే వింత మన ప్రేమే సుమా

(వచ్చింది పూలమాసం చిన్నవాడి ప్రేమకోసం
అందాల నీలాకాశం అందం చందం సంబరం)

No comments: