Friday, December 10, 2010

చిత్రం : అల్లరి ప్రియుడు (1993) రచన : వెన్నెలకంటి సంగీతం : ఎం.ఎం.కీరవాణి గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

పల్లవి :
ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా 
గమ్యం తెలియని పయనమా
ప్రేమకు పట్టిన గ్రహణమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా
ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా

చరణం : 1
ప్రేమ కవితా గానమా
నా ప్రాణమున్నది శ్రుతి లేక
గేయమే ఎద గాయమైనది 
వలపు చితిని రగిలించగా
తీగచాటున రాగమా 
ఈ దేహమున్నది జత లేక
దాహమార ని స్నేహమై 
ఎద శిథిల శిశిరమై మారగా
ఓ హృదయమా... ఇది సాధ్యమా...
రెండుగ గుండే చీలునా
ఇంకా ఎందుకు శోధన
ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా

చరణం : 2
ప్రేమసాగర మధనమే 
జరిగింది గుండెలో ఈవేళ
రాగమన్నది త్యాగమైనది 
చివరికెవరికీ అమృతం
తీరమెరుగని కెరటమై 
చెలరేగు మనసులో ఈవేళ
అశ్రుధారలే అక్షరాలుగా 
అనువదించెనా జీవితం
ఓ ప్రాణమా... ఇది న్యాయమా...
రాగం అంటే త్యాగమా
వలపుకు ఫలితం శూన్యమా

చిత్రం : అల్లరి ప్రియుడు (1993)
రచన : వెన్నెలకంటి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

No comments: