Thursday, December 23, 2010

చిత్రం : వేదం (2010),రచన : సిరివెన్నెల,సంగీతం : ఎం.ఎం.కీరవాణి,గానం : దీపు, గీతామాధురి, చైత్ర

పల్లవి :
వన్... టూ... త్రీ...
పద పద పద పద పద
నిన్ను నువు తరుముతు పద...

ఇప్పుడు కాకుంటే ఇంకెపుడూ కానట్టే
ఇక్కడనే ఉంటే ఉన్నా లేనట్టే
నౌ ఆర్ నెవర్... నౌ ఆర్ నెవర్... (2)

చరణం : 1
నిండు నూరేళ్ల పాటు
నిండు నూరేళ్ల పాటు
ప్రతిరోజూ ఏదో లోటు
అదే మదిలో రేపుకి చోటు
నిండు నూరేళ్ల పాటు
ప్రతిరోజూ ఏదో లోటు
ఆ లోటే లేకుంటే
మదిలో రేపటికేది చోటు...
ఇది సరిపోదంటూ
ఏదో సాధించాలంటూ
ఎదట లేని మరునాటిని
నేడే కలల కళ్లతో చూస్తున్నావా
నౌ ఆర్ నెవర్... పద పద పద పద పద
నౌ ఆర్ నెవర్...
నిన్ను నువు తరుముతు పద...
నౌ ఆర్ నెవర్...

చరణం : 2
నీతో నువు కలహిస్తూ
నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ
సమయం పై చిరకాలం
చెరగని సంతకాన్ని పెట్టు
నువ్వాగిన చోటే
కాలం ఆగుతుంది అంటూ
లోకం చదివే నీ కథకిపుడే
శ్రీకారం చుట్టు...
ఆర్ నెవర్‌...

చిత్రం : వేదం (2010)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : దీపు, గీతామాధురి, చైత్ర

No comments: