Tuesday, December 14, 2010

KANNULU RENDU KALAVARAPADUTUNTE(10TH CLASS)

కన్నులు రెండు కలవరపడుతుంటే
గుండెల సవ్వడి గుసగుసమంటుంటే
నాలో ప్రతి ఆశ నాలో ప్రతి శ్వాస
నాలో ప్రతి ఆశ నువ్వే కావాలంటే
రోజు కనుపాప నిన్నే చూడాలంటే
ప్రేమేనంటావా..(2)(కన్నులు)
గాలి తెమ్మెర వస్తున్నా
పరిమళాల స్వరాలుగా
రాక నీదే అంటున్నా.. పాట పల్లవి వింటున్నా
పరవశాన చటుక్కున
పాట నీదే అంటున్నా
ఎమైనదేమో నాలోన ఎద లోలోన
గోదారిగాని పొంగేనా
ఈరోజే నేనూ వింటున్నా
మది ఆలపించే ప్రేమ కీర్తన
నే వెంట నీడై వస్తున్నా
పరిచయాలు వరాలుగా
నీ తీపి కలలే కంటున్నా
రోజు పని చేస్తున్నా
క్షణాలు యుగాలుగా
నీ ఊహలోనే ఉంటున్నా
మాయ అంతా నీదేనా తొలి ప్రేమేనా
నీలోన కూడా ఇంతేనా
హాయి అంతా ప్రేమేనా
మహా బాగుందయ్యా మూగ వేదన

No comments: