పల్లవి :
ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే ఋజువేమో
ఏం చేసిందో ఆ చిన్నది
ప్రేమించేసానందీ మది
తన పేరైనా అడగాలన్నా ఎదరుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా
ఎవ్వరే ఆ జాబిలి (2)
చరణం : 1
ఒక్కటే జ్ఞాపకం ఆమెతో పరిచయం
మబ్బులో మెరుపులా తగలటం
అక్కడే ఆ క్షణం మొదలు ఈ లక్షణం
నిద్రలో నడకలా సాగటం
ఆ మెరుపు కంట పడకుంటే
తన జంట కలసి నడవందే
ఈ మరపు వదలనంటుందే ఇంకెలా
చెప్పమ్మా ఓ పావురమా
ఆమెతో ఈ సంగతి
చరణం : 2
ఆమెనే వెతకటం అందుకే బతకటం
కొత్తగా ఉన్నదే అనుభవం
ప్రేమనే పిలవటం ప్రేమనే తెలపటం
బొత్తిగా నేర్పదీ సతమతం
తన కంటిచూపులో మౌనం
చదివేదెలాగ నా హృదయం
తన గుండె గూటిలో నే వాలే దెలా
చెప్పమ్మా కలవరమా
ఆమెతోనే అలజడి
చిత్రం : నీ స్నేహం (2002)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
గానం : రాజేష్, ఉష
No comments:
Post a Comment