Friday, December 10, 2010

చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964) రచన : ఆచార్య ఆత్రేయ సంగీతం : సాలూరి రాజేశ్వరరావు గానం : ఘంటసాల

పల్లవి :
ఎవరో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలియైనారు (2)

చరణం : 1
అడుగు అడుగున అపజయములతో
అలసి సొలసిన నా హృదయానికి
సుధవై... సుధవై జీవన సుధవై
ఉపశాంతినివ్వగా ఓర్వనివారలు

చరణం : 2
అనురాగానికి ప్రతిరూపాలై
ఆది దంపతులవలె మీరుంటే
ఆనందంతో మురిసానే
ఆత్మీయులుగా తలచానే
అందుకు ఫలితం అపనిందేనా

చరణం : 3
మనిషికి మనిషికి మమత కూడదా...
మనసు తెలుసుకొను మనసే లేదా
ఇది తీరని శాపం
ఇది మారని లోకం
మానవుడే దానవుడై
మసలే చీకటి నరకం

చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల

No comments: