పల్లవి :
సోనియా... సోనియా... (2)
సోనియా సోనియా
స్వీటు స్వీటు సోనియా
రేగుతోందె లేత వయసు జోరు
ఘాటు లవ్వు రెండు టైపు
నీటుదొకటి నాటుదొకటి
రెండిట్లో ఏది నాకు ప్యారు
సమ్‌టైమ్స్ నీటే స్వీటు...
సమ్‌టైమ్స్ నాటే రైటు...
పిల్లా కళ్లను చూసే చేసెయ్
గురువా ఫైటు...
చరణం : 1
పువ్వుల్ని తడిమే చిరుగాలి మల్లే
చెక్కిళ్ళు తడితే అది నీటు
కొమ్మల్ని విరిచే సుడిగాలి మల్లే
ఒడి చేర్చుకుంటే అది నాటు
పచ్చిక మీద పడే చినుకుల మల్లే చిరు
ముద్దులు పెట్టి శ్రుతి చేయడమే నీటు
కసిగా మీద పడే ఉప్పెన మల్లే
చెలి పైటని పట్టి చిత్తు చేయడమే నాటు
నీ కురుల మీద పువ్వును నేనై
మురిపించేయాటలాడించనా
మృదువైన ముద్దుల్లో సొగసే ఉందే
మంచంలో మాటలకీ చోటే ఉందే
మత్తెక్కె కౌగిట్లో ముంచెస్తా అమ్మడు
చరణం : 2
ఊరించే ఒడిలో ఉప్పొంగె తడిలో
బుగ్గల్ని ఎంచక్కా పిండేస్తుంటే
పరువాల పిలుపు కళ్లల్లో
మెరుపై గుండెల్లో సెగలే రగిలిస్తుంటే
కౌగిలి క్రికెట్‌కి సిస్టమ్ లేదే
అంపైరు లేదే మగతనముంటే చాలే
పట్టీ పడదోస్తే వేగేదెట్టా బరువాపేదెట్టా
ఎద మల్లెల పూమాలోయ్
నలిపేకపోతే అందం లేదే
కసిలేని మోహం మోహంకాదే
కోమలితో వాదిస్తే అర్థముందా
కవ్వించి కాటేస్తే న్యాయం ఉందా
ప్రేయసిని గెలిచేది నా చూపు తనమేగా
చిత్రం : రక్షకుడు (1998)
రచన : భువనచంద్ర
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : ఉన్నికృష్ణన్, ఉదిత్, హరిణి
No comments:
Post a Comment