శివానీ....భవానీ...శర్వాణీ....
గిరినందిని శివరంజని
భవ భంజని జననీ(2)
శతవిధాల శృతి విధాన స్తుతులు
సలుపలేని నీ సుతుడనే శివానీ...
శివానీ....భవానీ...శర్వనీ....
శృంగారం తరంగించు
సౌందర్యలహరివని...ఆ....(2)
శాంతం మూర్తీభవించు
శివానందలహరివని....ఆ...(2)
కరుణ చిలుకు సిరినగవుల
కనకదారవీవనీ
నీ దరహాసమే దాసుల
దరిజేర్చే దారియని
శతవిధాల శృతి విధాన స్తుతులు
సలుపలేని నీ సుతుడనే శివానీ
శివానీ....భవానీ..శర్వాణీ...
రౌద్రవీర రసోద్రిక్త భధ్రకాళివీవనీ
భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ(రౌద్ర వీర)
భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ
భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ...
అద్భుతమౌ అతులితమౌ
లీల జూపినావనీ....(గిరినందిని)
No comments:
Post a Comment