పల్లవి :
భళి భళి భళి భళి దేవా... ఆ...
బాగున్నదయా నీ మాయా
॥భళి॥
బహు బాగున్నదయా నీ మాయా
చరణం : 1
ఒకరికి ఖేదం ఒకరికి మోదం
సకలము తెలిసిన నీకు వినోదం
నీవారెవరో పై వారెవరో... (2)
ఆ విధికైనను తెలియదయా
బాగున్నదయా నీ మాయా
చరణం : 2
సుఖదుఃఖాలతో గుంజాటనబడు
లోకము నీ చెలగాటమయా
లీలలు మాయలు నీ గుణకథలు (2)
తెలిసినవారే ధన్యులయా
బాగున్నదయా నీ మాయా
॥భళి॥
జై సత్యసంకల్ప జై శేషతల్పా
జై దుష్ట సంహార జై దీనకల్పా
జై భక్త పరిపాల జై జగజ్జాలా
నీవు జరిపించేటి నీ చిత్ర కథలు
వ్రాసినా చూసినా వినిన ఎల్లరును
శుభ సంపదలు గలిగి వర్థిల్ల గలరు
సుఖశాంతులను కలిగి శోభిల్లగలరు
చిత్రం : మాయాబజార్ (1957)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : ఘంటసాల
గానం : మాధవపెద్ది సత్యం
No comments:
Post a Comment