Tuesday, December 14, 2010

YEDUTA NILICHINDI(VAANA)

ఎదుట నిలిచింది చూడు..
జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు
చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయ మాయలో
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా!
ఎదుట నిలిచింది చూడు..

నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలి
అవునో..కాదో.. అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా
ఎదుట నిలిచింది చూడు..

నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందో నా లేఖ
వినేవారు లేక విసుక్కుంది నా కేక
నేడో..కాదో..రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమ..
వరం లాంటి శాపమేదో సొంతమైందిలా(ఎదుట)

No comments: