పల్లవి : ఆ... ఏమిటే... ఏమిటి ఈ అవతారం? ఎందుకు ఈ సింగారం? పాత రోజులు గుర్తొస్తున్నవి ఉన్నది ఏదో వ్యవహారం చాలును మీ పరిహాసం ఈ సొగసంతా మీ కోసం చరణం : 1 పౌడరు దెచ్చెను నీకందం బాగా వెయ్ వేలెడు మందం॥ తట్టెడు పూలు తలను పెట్టుకుని తయారైతివా చిట్టి వర్థనం చరణం : 2 ఆ... ఆ... ఓ... ఓ... వయసులోన నే ముదురుదాననా వయ్యారానికి తగనిదాననా వరుసకాన్పులై వన్నె తగ్గినా అందానికి నే తీసిపోదునా ఏమిటి నా అపరాధం ఎందుకు ఈ అవతారం చరణం : 3 దేవకన్య ఇటు ఓహో... దేవకన్య ఇటు దిగివచ్చిందని భ్రమిసి పోదునా కలనైనా మహంకాళి నా పక్కనున్నదని మరచిపోదునా ఎపుడైనా చరణం : 4 నీళ్లు కలపని పాలవంటిది పిండి కలపని వెన్నవంటిది నిఖారుసైనది నా మనసు ఊరూవాడకు ఇది తెలుసు ఏమిటి ఈ అవతారం? చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963) రచన : కొసరాజు రాఘవయ్య చౌదరి సంగీతం : సాలూరి రాజేశ్వరరావు గానం : మాధవపెద్ది సత్యం, స్వర్ణలత |
Friday, December 10, 2010
చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963) రచన : కొసరాజు రాఘవయ్య చౌదరి సంగీతం : సాలూరి రాజేశ్వరరావు గానం : మాధవపెద్ది సత్యం, స్వర్ణలత
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment