Tuesday, December 14, 2010

MONNA KANIPINCHAVU(SURYA SON OF KRISHNAN)

మొన్న కనిపించావు మైమరచిపోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే..
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన
ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా
ఊరంతా చూసేలా అవుదాం జత

త్రాసులో నిన్నే పెట్టి
తూకానికి పుత్తడి పెడితే
తులాభారం తూగేది ప్రేయసికే
ముఖం చూసి పలికే వేళ
భలే ప్రేమ చూసిన నేను
హత్తుకోకపోతానా అందగాడా
ఓ..నీడవోలె వెంబడి ఉంటా
తోడుగా చెలి
పోగవోలె పరుగున వస్తా
తాకనే చెలి
వేడుకవో కలవో నువ్వు
వింతవో చెలి..(మొన్న)

కడలి నేల పొంగే అందం
అలలు వచ్చి తాకే తీరం
మనసు జిల్లుమంటుందే ఈ వేళలో
తల వాల్చి ఎడమిచ్చావే
వేళ్ళు వేళ్ళు కలిపేసావే
పెదవికి పెదవి దూరమెందుకే
పగటి కలలు కన్నా నిన్ను
కునుకు లేకనే
హృదయమంత నిన్నే కన్నా
దరికి రాకనే
నువ్వు లేక నాకు లేదు
లోకమన్నది(మొన్న)

No comments: