పల్లవి :
తెలిసీ తెలిసీ వలలో పడెనే వయసు
తలచీ వలచీ కలలే కనెనే మనసు
తనువున ఎన్నో తపన లు రేగే
తహ తహలోనే తకదిమి సాగే
చరణం : 1
పొద్దసలే పోక నిద్దర పోనీక
ఎవ్వరిదో కేక ఎద లోతుల దాకా
భారమాయె యవ్వనం
బోరు కొట్టే జీవితం
రగిలేటి విరహాన రాధల్లె నేనున్నా
నీ గాలి సోకేనా నా ఊపిరాడేనా
అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే (2)
చరణం : 2
నాకొద్దీ దూరం వెన్నెల జాగారం
బాత్‌రూం సంగీతం
లేత ఈడు ఏకాంతం
కోపమొచ్చె నామీద
తాపమాయె నీ మీద
దేహాలు రెండైనా ప్రాణాలు నీవేగా
విసిగించు పరువాన
విధిలేక పడివున్నా
చిత్రం : ఆనంద్ (2004)
రచన : వేటూరి
సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్
గానం : శ్రేయాఘోషల్, బృందం
No comments:
Post a Comment