నిదరే కల అయినది..కలయే నిజమైనది..
బతకే జత అయినది..జతయే అతనన్నది..
మనసేమో ఆగదు..క్షణమైన తోచదు..
మొదలాయే కథే ఇలా..(2)
వయసంతా వసంత గాలి
మనసనుకో మమతనుకో
ఎదురైనది ఎడారి దారి..
చిగురులతో చిలుకలతో..
యమునకొకే సంగమమే
కడలినది కలవదులే..
హృదయమిలా అంకితమై
నిలిచినది తనకొరకే
పడిన ముడి పడచు ఒడి
ఎదలో చిరు మువ్వల సవ్వడి(నిదురే)
అభిమానం అనేది మౌనం
పెదవులపై పలుకదులే..
అనురాగం అనే సరాగంస్వరములకే దొరకదులే
నిను కలిసిన క్షణమే
చిగురించే మధుమురళి..
నిను తగిలిన ఈ తనువే
పులకరించే ఎద రగిలి..
ఎదుట పడి కుదుట పడే
మమకారపు నివాళిలేఇది(నిదురే)
No comments:
Post a Comment