నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా(2) నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దు ముచ్చట కాదంటానా
సరదా పడితే వద్దంటానా హయ్య....(నువ్వడిగింది)
నీకోసమే మరుమల్లెలా పూచింది నా సొగసు
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసు(నీకోసమే) దాచినదంతా నీ కొరకే(2) నీ కోరిక చూపే నను తొందర చేసే
నా ఒళ్ళంతా ఊపేస్తూ వుంది
నాలో ఏదో అవుతోంది(నువ్వడిగింది)
నీ మగతనం నా యవ్వనం
శృంగారమే చిలికే
ఈ అనుభవం ఈ పరవశం
సంగీతమై పలికే
పరుగులు తీసే నా పరువం(2) నీ కధలే వింది నువ్వు కావాలంది
నా మాటేదీ వినకుండా ఉంది
నీకూ నాకే జోడంది(నువ్వడిగింది)
No comments:
Post a Comment