Tuesday, December 14, 2010

MARALA TELUPANA(SWAYAMVARAM)

ఆ..మపమపరి రిమరిమస ఆ..
మరల తెలుపనా ప్రియా..
మరల తెలుపనా(2)
ఎదలోయల దాచుకున్న
మధురోహల పరిమళాన్ని(2)
కనుపాపలు నింపుకున్న
చిరునవ్వుల పరిచయాన్ని(మరల)

విరబూసిన వెన్నెలలో
తెరతీసిన బిడియాలని(2)
ఆణువణువూ అల్లుకున్న
అంతులేని విరహాలని(2)
నిదురపోని కన్నులలో
పవళించు ఆశలని
చెప్పలేక చేతకాక
మనసు పడే తడబాటుని..(మరల)

నిన్న లేని భావమేదో
కనులు తెరిచి కలయచూసి(2)
మాటరాని మౌనమేదో
పెదవి మీద ఒదిగిపోయే(2)
ఒక క్షణమే ఆవేదన
మరు క్షణమే ఆరాధన
తెలియరాక తెలుపలేక
మనసు పడే మధుర బాధ(మరల)

No comments: