Tuesday, December 14, 2010

HAYI HAYIGA JABILLI(VELUGU NEEDALU)

హాయి హాయిగా జాబిల్లి
తొలి రేయి వెండి దారాలల్లి
మందు జల్లి నవ్వసాగే ఎందుకో
మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో

తళతళ మెరిసిన తారక
తెలి వెలుగుల వెన్నెల దారుల
కోరి పిలిచెనో తన దరిచేరగా
మది కలచేనో తీయని కోరిక

మిలమిల వెలిగే నీటిలో
చెలి కలువల రాణి చూపులో(2)
సుమదళములు పూచిన తోటలో
తొలి వలపుల తేనెలు రాలేనో

విరిసిన హృదయమే వీణగా
మధు రసముల కొసరిన వేళల(2)
తొలి పరువములొలికెడు సోయగం
కానీ పరవశమొందెనో మానసం

No comments: