Friday, December 10, 2010

చిత్రం : కులగోత్రాలు (1962) రచన : కొసరాజు రాఘవయ్య చౌదరి సంగీతం : సాలూరి రాజేశ్వరరావు గానం:మాధవపెద్ది, పిఠాపురం, రాఘవులు

పల్లవి :
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే ॥
అనుపల్లవి : ఉన్నది కాస్తా ఊడింది
సర్వ మంగళం పాడింది (2)
పెళ్లాం మెళ్లో నగలతో సహా తిరుక్షవరమై పోయింది ॥ 
చరణం : 1
ఆ మహా మహా నలమహారాజుకే 
తప్పలేదు భాయీ
ఓటమి తప్పలేదు భాయీ
మరి నువు చెప్పలేదు భాయీ
అది నా తప్పుగాదు భాయీ
తెలివి తక్కువగ 
చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ బాబూ నిబ్బరించవోయీ ॥
చరణం : 2
నిలువు దోపిడీ దేవుడికిచ్చిన
ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది
గోవిందా... గోవిందా... ॥
చక్కెర పొంగలి చిక్కేది
ఎలక్షన్లలో ఖర్చుపెడితే 
ఎం.ఎల్.ఏ దక్కేది
మనకు అంతటి లక్కేదీ॥

చరణం : 3
గెలుపూ ఓటమి దైవాధీనం 
చెయ్యి తిరగవచ్చు
మళ్ళీ ఆడి గెల్వవచ్చు
ఇంకా పెట్టుబడెవడిచ్చు
ఇల్లు కుదవ చేర్చవచ్చు
ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో 
మన కరువు తీరవచ్చు
పోతే... అనుభవమ్ము వచ్చు
చివరకు జోలె కట్టవచ్చు ॥

చిత్రం : కులగోత్రాలు (1962)
రచన : కొసరాజు రాఘవయ్య చౌదరి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం:మాధవపెద్ది, పిఠాపురం, రాఘవులు

No comments: