అభినందన మందార మాల(౩)
అధినాయక స్వాగత వేళ
అభినందన మందార మాల
స్త్రీ జాతికి ఏ నాటికి
స్మరణీయ మహనీయ వీరాంగనికి
అభినందన మందార మాల
వేయి వేణువులు నిన్నే పిలువగా
నీ పిలుపు నా వైపు పయనించెనా(2)
వెన్నెల కన్నెలు నిన్నే చూడగా(2)
నీ చూపు నా రూపు వరియించెనా
నా గుండెపై నీవుండగా
దివి తానె భువి పైనే దిగి వచ్చెనా
అభినందన మందార మాల
అలివేణి స్వాగత వేళ అభినందన మందార మాల
సౌందర్యము సౌశీల్యము
నిలువెల్లా నెలకొన్న కలభాషిణికి
అభినందన మందార మాల
వెండి కొండపై వెలసిన దేవర
నెలవంక మెరిసింది నీ కరుణలో(2)
సగము మేనిలో ఒదిగిన దేవత(2)
నీ సిగ్గు తొణికింది నీ తనువులో(2)
ప్రియ భావమే లయ రూపమై
అలలెత్తి ఆడింది అణువణువులో
అభినందన మందార మాల
ఉభయాత్మల సంగమ వేళా
అభినందన మందార మాల
No comments:
Post a Comment