పల్లవి :
మగధీర ధీర ధీర ధీర ధీర (3)
మగధీరా...
మగధీర నన్నే చేకొనరా నాపైట
నెగరవే య సమయమేదిరా
ఓ... ప్రేమపిచ్చి పట్టి వగచేరా
ముద్దుల వర్షం కురిపించరా
కత్తుల సవ్వడి విన్న వీరా
గాజుల సవ్వడి వినుకోవేరా
మగధీరా... మగధీరా...
చరణం : 1
ఆ... ఆ... శుభ ఘడియ చూసి కురులు తీసి పద్దురాయరా జబ్బపైనా
ఆ... ఆ... బంగారు కుంచె
తేనెలో ముంచి
సంతకం చేస్తా నీ గుండెపైనా
లోకం కోసం నిధి పంచు
ఈ దేహం కోసం ఒడిపంచు
ప్రభువుల మనుగడ విధి ధర్మం
బలికావడమే చెలి ధర్మం
ప్రియతమా... ప్రియతమా...
నీకై వేచి ఉన్నా
చరణం : 2
గుడులెన్నొ తెరచి బడులు తెరచి
పడక గది చేర తీరికలేదా
ఓ... కలహాలు తీర్చి చట్టాలు మార్చి
కౌగిలి చేరుట పాడి కాదా
మోహంలో నను ముంచేసి
మంత్రులతోనే మంతనమా
నీ కంట నీరు తుడవంగా
ఊళ్లో కుళాయి నీళ్లిచ్చునా
ప్రణయమా... ప్రణయమా...
నాపై దయ చూపుమా
చిత్రం : ఒకేఒక్కడు (1999)
రచన : ఎ.ఎం.రత్నం, శివగణేశ్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : శంకర్‌మహదేవన్, ఎస్.జానకి
No comments:
Post a Comment