Tuesday, December 14, 2010

PREYASI KAVU NESTAM KAVU(VENNELA)

ప్రేయసి కావు నేస్తం కావు
గుండెల్లో నిండున్నావు
గుప్పెట్లో దాగున్నావు
చీకట్లో వెలుగిస్తావు
జగమంతా కనిపిస్తావు
పండుగ నీవు నా పచ్చిక నీవు(2)

మోహమే మంటగా రగులుతున్నా
లోకమే నీవుగా మునిగివున్నా
గాలిలో ఈకల తేలుతున్నా
నీటిలో రాతలా చెదిరివున్నా
నీ శ్వాసకోసం మానై వుంటా
నీ మాటకోసం మునినై పోతా
నీ నవ్వుకోసం అలుసై పోతా
జాబిలికే వెన్నెల నీవు
సూర్యునికే వేకువ నీవు
ఊపిరికే ఉష్ణం నీవు
ఊరించే తృష్ణం నీవు
శూన్యం నీవు నా శోకం నీవు(2)

వేసవి వర్షమై కురిసిపోవా
వెచ్చని వేకువై వెలిగిరావా
మాటతో రూపమై తరలిరావా
నిర్ణయం చెప్పి నన్ను ఆడుకోవా
నీ తోడుకోసం ఆవిరైపోనా
నీ స్పర్శకోసం చినుకై రానా
నీ అడుగు తాకి గుడినైపోనా
నీ గుండెలోకి సడినై రానా
నీలానికి నింగివి నీవు
కాలానికి గమ్యం నీవు
చలనానికి శక్తివి నీవు
భావానికి మూలం నీవు
ఎవ్వరి కోసం జాబిలి వేషం
కమ్మని కావ్యం వెన్నెల దీపం(ఎవ్వరి కోసం)

No comments: