Tuesday, December 14, 2010

PRANATHI PRANATHI(SWATHI KIRANAM)

సా రే గ మా ప మా గ మా స రే ని రి స
ప మా గ మా స రి
సా రి గ మా ప ని స ని ప మా గ మా స రి రి సా
ప్రణతి ప్రణతి ప్రణతి
ప మా ప మా గ మా స రే సా
ప్రణతి ప్రణతి ప్రణతి
ప్రణవ నాద జగతికి
పమప మామప మా ప నీ
ప్రణుతి ప్రణుతి ప్రణుతి
ప్రధమ కళా సృష్టికి

పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై సుఖపికాది కలరవం ఐంకారమా
పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై సుఖపికాది కలరవం ఐంకారమా
పైరు పాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి హ్రీంకారమా హ్రీంకారమా
గిరుల శిరసులను జారే ఝరుల నాదాల వడి అలజడి శ్రీంకారమా శ్రీంకారమా
ఆ బీజాక్షర విగతికి అర్పించే ద్యోతలివే

పంచ భూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన అది కవనమా
మా గ మా పా ప మా పా పా ప ప ప
నిపపాప నిపపాప నిపాపపమా
గ ప మా ప మా గా
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేళనా అది నటనమా అది నటనమా
కంటి తుదల హరివింటి పొదల తళుకందిన సవర్ణ లేఖనా అది చిత్రమా అది చిత్రమా
మౌన శిలల చైతన్య మూర్తులుగా మలచిన సజీవ కల్పనా అది శిల్పమా అది శిల్పమా
ఆ లలితా కళల సృష్టికి అర్పించే ద్యోతలివే

No comments: