Friday, December 10, 2010

చిత్రం : మనదేశం (1949) manadesham telugu movie telugu lyrics

జయహో... జయహో...
మహాత్మగాంధీ జయ విజయీభవ 
భారతధాత్రీ
జైబోలో జైబోలో బోలో బోలో జైబోలో
స్వతంత్ర భారత నరనారీ

పరాధీనత బంధ విమోచన
మహాపర్వ మీ శుభదినము
అభంగ స్వేచ్ఛా రణాంగణములో
సాహసానికిది ఫలము

స్వతంత్ర మానవ జాతులలో
మన మాటకు విలువ...
మనకొక జెండా లభించె నేటికి
ఇక ఏనాటికి మనదే మనదే
మనదే మనదే మనదేశం...

చిత్రం : మనదేశం (1949)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : ఘంటసాల
గానం : బృందగానం

No comments: