Thursday, December 23, 2010

చిత్రం : మన్మథబాణం (2010)

 
పల్లవి :
నీలాకాశం... నీ నాకోసం...
జోలలే పాడగా వేడుకే వేడుక
అందమే విల్లుగా బాణమే వేయగా
ప్రేమనే మాయగా తేలెనే ఊహలు
ఇక నువ్వంటు నేనంటు
గిరిగీతలే లేవులే
నీలాకాశం... నీ నాకోసం...

చరణం : 1
నీలోనే నా ఊపిరి నేనంటూ లేనే మరి
నీ పేరు నా పేరునే జోడిస్తే ప్రేమే అది
తీసే శ్వాసే ప్రేమించడం
నీ కోసమే నే జీవించడం
నీది నాది జన్మ బంధం
గుండె గుండె మార్చుకున్నాం
కోరేందుకే మాట మిగిలిందిక
నీ తోడు దొరికిందిగా...
నీలాకాశం... నీ నాకోసం
శ్రీరస్తు శుభమస్తు చిరశాంతి సుఖమస్తు
అందాల బంధానికి

చరణం : 2
ఆరారు కాలాలకు
ఆనందం నీ స్నేహ మే
మండేటి గాయాలను
మాన్పించే మంత్రం నువ్వే
స్వర్గం అంటే ఏవిఁటంటే
నీవున్న చోటే అంటా చెలీ
నిత్యం నన్ను వెన్ను తట్టి
నడిపించు మార్గము నువ్వే మరి
చిరుగాలి పొర కూడా చొరలేదులే
నిను నన్ను విడదీయగా
నీలాకాశం... నీ నాకోసం...

చిత్రం : మన్మథబాణం (2010)
రచన : రామజోగయ్యశాస్ర్తి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : కమల్‌హాసన్, ప్రియా హిమేష్

చిత్రం : ఝుమ్మంది నాదం (2010)

సుద్దాల అశోక్‌తేజ
పల్లవి :
లాలి పాడుతున్నది ఈ గాలి
ఆ లాలి రాగాలలో
నువు ఊయల ఊగాలి
ఏలో యాలా ఏలో యాలా హైలెస్సో
హైల పట్టు హైలెస్సా
బల్లాకట్టు హైలెస్సా
అద్దిర బాబు హైలెస్సా
అక్కడ పట్టు హైలెస్సా
సన్నాజాజి చీరకట్టి
సిన్నాదొచ్చి హైలెస్సా
కన్నూగొట్టే హైలెస్సా...
తన్నానన్న తన్నన
తన్నానన్నా హైలెస్సా

చరణం : 1
గాలి కొసల లాలి ఆ పూల తీవెకు
వేలి కొసల లాలి ఈ బోసి నవ్వుకు
బుడి బుడి నడకలకు భూమాత లాలి
ముద్దు ముద్దు పలుకులకు
చిలకమ్మ లాలి
ఉంగా ఉంగా సంగీతాలకు
కోయిలమ్మ లాలి
కుహుఁ... కుహుఁ...
చెంగు చెంగు గంతులకు చందమామలు
దాగివున్న కుందేలమ్మ లాలి
నా లాలి నీకు పూలపల్లకి
అలసిన కళ్లకి సొలసిన కాళ్లకి
ఏమేమి పూవొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
గుమ్మాడి పూవొప్పునే గౌరమ్మ
గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ

గుమ్మాడి సెటు మీద ఆట చిలకల్లారా
పాట చిలకల్లారా కలికి చిలకల్లారా
కందుమ్మ గడ్డలు కలవారి మేడలు
ముత్యప్పు గొడుగులు
మురిపాల మురుగులు
రంగు రుద్రాక్షలు తీరు గోరింటలు
తీరు రుద్రాక్షలు పరుగుల కట్టలు

చరణం : 2
వెన్నముద్ద లాలి చిన్నారి మేనికి
గోరుముద్ద లాలి బంగారు బొమ్మకి
ఓనమాలు పలికితే పలకమ్మ లాలి
బాలశిక్ష చదివితే పలుకులమ్మ లాలి
దినదినము ఎదుగుతుంటే
దినకరుని లాలి
పదుగురొచ్చి నిను మెచ్చితే కన్నులారా చూసే తల్లికి కడుపు తీపి లాలి
లాలి...

చిత్రం : ఝుమ్మంది నాదం (2010)
రచన : సుద్దాల అశోక్‌తేజ
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : బాలు, గీతామాధురి, బాలాజి, దీపు

చిత్రం : శివాజీ (2007)

పల్లవి :నవ్వుల్ నవ్వుల్ మువ్వల్ మువ్వల్ (2)
పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్...
నవ్వల్లే మువ్వల్ మువ్వల్...
నా తీయని ఆశల పూలతడి
నీ లావణ్యానికి మొక్కుబడి
నీ కాటుక కళ్లకు జారిపడి
పని బడేట్టు చేరితి పైన బడి
వాజి వాజి వాజి రారాజీ నా శివాజీ
వాజి వాజి వాజి రేరాజే నా శివాజీ
చూపే కత్తికదూ అది నా సొత్తుకదూ
నీలో వాసన నా తనువంతా పూసెళ్లు
ఎదగుత్తులతోనే గట్టిగా ఇపుడే
గుండె ముట్టి వెళ్లు

చరణం : 1
సిరివెన్నెలవే మెలిక మల్లికవే
విరితేనియవే ఇక ఊ అనవే
నా కౌగిటిలో ఇలా ఇలా త్వరగా
పుత్తడిబొమ్మ ఇది
సుందరిని పొందులో నలిపైరా (2)
విధికి తలవంచని రణధీర
ఎదకు ఎద సర సర కలిపైరా
ఓ... మాటలతో ఎందుకే చెలియా
చేతలతోనే రతీమగని ధీటునే

చరణం : 2
పసి జాణ ఇది తన ఊసులతో
కసి తళుకులతో నను లాగెనులే
అందుకొందునుగా
సుఖం సుఖం ఇంకా
ఆనంద సందడిలో
చందురుని మోముగా మలచుకోనా
తారలిక జతులతో ఆడే
వెన్నెలను వేదిక చేసైనా
అరెరరే అల్లరి చేసే చిన్నది చూస్తే
పాలరాతి బొమ్మరో
వాజి... వా వా వా...

చిత్రం : శివాజీ (2007)
రచన : సుద్దాల అశోక్‌తేజ
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : హరిహరన్, మధుశ్రీ, బృందం

చిత్రం : మాయాబజార్ (1957)

నేడు మాధవపెద్ది సత్యం వర్ధంతి
పల్లవి :
భళి భళి భళి భళి దేవా... ఆ...
బాగున్నదయా నీ మాయా
॥భళి॥
బహు బాగున్నదయా నీ మాయా

చరణం : 1
ఒకరికి ఖేదం ఒకరికి మోదం
సకలము తెలిసిన నీకు వినోదం
నీవారెవరో పై వారెవరో... (2)
ఆ విధికైనను తెలియదయా
బాగున్నదయా నీ మాయా

చరణం : 2
సుఖదుఃఖాలతో గుంజాటనబడు
లోకము నీ చెలగాటమయా
లీలలు మాయలు నీ గుణకథలు (2)
తెలిసినవారే ధన్యులయా
బాగున్నదయా నీ మాయా
॥భళి॥

జై సత్యసంకల్ప జై శేషతల్పా
జై దుష్ట సంహార జై దీనకల్పా
జై భక్త పరిపాల జై జగజ్జాలా
నీవు జరిపించేటి నీ చిత్ర కథలు
వ్రాసినా చూసినా వినిన ఎల్లరును
శుభ సంపదలు గలిగి వర్థిల్ల గలరు
సుఖశాంతులను కలిగి శోభిల్లగలరు

చిత్రం : మాయాబజార్ (1957)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : ఘంటసాల
గానం : మాధవపెద్ది సత్యం

చిత్రం : వేదం (2010),రచన : సిరివెన్నెల,సంగీతం : ఎం.ఎం.కీరవాణి,గానం : దీపు, గీతామాధురి, చైత్ర

పల్లవి :
వన్... టూ... త్రీ...
పద పద పద పద పద
నిన్ను నువు తరుముతు పద...

ఇప్పుడు కాకుంటే ఇంకెపుడూ కానట్టే
ఇక్కడనే ఉంటే ఉన్నా లేనట్టే
నౌ ఆర్ నెవర్... నౌ ఆర్ నెవర్... (2)

చరణం : 1
నిండు నూరేళ్ల పాటు
నిండు నూరేళ్ల పాటు
ప్రతిరోజూ ఏదో లోటు
అదే మదిలో రేపుకి చోటు
నిండు నూరేళ్ల పాటు
ప్రతిరోజూ ఏదో లోటు
ఆ లోటే లేకుంటే
మదిలో రేపటికేది చోటు...
ఇది సరిపోదంటూ
ఏదో సాధించాలంటూ
ఎదట లేని మరునాటిని
నేడే కలల కళ్లతో చూస్తున్నావా
నౌ ఆర్ నెవర్... పద పద పద పద పద
నౌ ఆర్ నెవర్...
నిన్ను నువు తరుముతు పద...
నౌ ఆర్ నెవర్...

చరణం : 2
నీతో నువు కలహిస్తూ
నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ
సమయం పై చిరకాలం
చెరగని సంతకాన్ని పెట్టు
నువ్వాగిన చోటే
కాలం ఆగుతుంది అంటూ
లోకం చదివే నీ కథకిపుడే
శ్రీకారం చుట్టు...
ఆర్ నెవర్‌...

చిత్రం : వేదం (2010)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : దీపు, గీతామాధురి, చైత్ర

చిత్రం : ఇది కథ కాదు (1979)రచన : ఆచార్య ఆత్రేయ,సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్,గానం : ఎస్.జానకి

పల్లవి :
ఆ... ఆ... ఆ... ఆ... ఆ.....
గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగ వెల్లువ కమండలంలో
ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా

చరణం : 1
ఆ నింగిలో మబ్బునై
పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై
ఆడనా ఆటలు ఎన్నో ॥నింగిలో॥
తుళ్లి తుళ్లి గంతులు వేసే
లేగకేది కట్టుబాటు
మళ్లి మళ్లి వసంతమొస్తే
మల్లెకేల ఆకుచాటు ॥
చరణం : 2
ఓ తెమ్మెరా ఊపవే
ఊహల ఊయల నన్ను
ఓ మల్లికా ఇవ్వవే
నవ్వుల మాలిక నాకు
తల్లి మళ్లీ తరుణయ్యింది
పువ్వు పూచి మొగ్గయ్యింది
గుడిని విడిచి వేరొక గుడిలో
ప్రమిదనైతే తప్పేముంది

చిత్రం : ఇది కథ కాదు (1979)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
గానం : ఎస్.జానకి

చిత్రం : రాజాధిరాజు (1980),రచన : వేటూరిమహదేవన్,గానం : పి.సుశీల

రాజ్యము బలము మహిమ నీవే నీవే
జవము జీవము జీవనమీవేనీవే

మరియ తనయ మధుర హృదయ (2)
కరుణామయా! కరుణామయా!

చరణం : 1
అవసరానికి మించి ఐశ్వర్యమిస్తే
మనిషి కన్ను మిన్ను కానబోడే మో
కడుపుకు చాలినంత కబళమీయకుంటే
మనిషి నీతి నియమం పాటించడేమో
మనిషి మనుగడకు సరిపడనిచ్చి
శాంతి ప్రేమ తృప్తినిచ్చి

గుండె గుండె నీ గుడి దీపాలై
అడుగు అడుగు నీ ఆలయమయ్యే
రాజ్యమీవయ్యా... నీ రాజ్యమీవయ్యా

చరణం : 2
అర్హత లేని వారికి అధికారం ఇస్తే
దయ ధర్మం దారి తప్పునేమో
దారి తప్పిన వారిని చేరదీయకుంటే
తిరిగి తిరిగి తిరగబడతారేమో
తగిన వారికి తగు బలమిచ్చి
సహనం క్షమ సచ్ఛతనిచ్చి

తనువు తనువు నిరీక్షణశాలై
అణువు అణువు నీ రక్షణశాలయ్యే
బలమీవయ్యా... ఆత్మబలమీవయ్యా

చరణం : 3
శిలువపైన నీ రక్తం చిందిననాడే
శమదమాలు శోధించెను గాదా
నీ పునరుత్థానంతో రక్షణ రాజిల్లి
శోకం మరణం మరణించెను గాదా
చావు పుటుక నీ శ్వాసలని
దయా దండన పరీక్షలని

ఉనికి ఉనికి నీ వెలుగు నీడలని
సత్యం మార్గం సర్వం నీవని
మహిమ తెలుపవయ్యా...
నీ మహిమ తెలుపవయ్యా

చిత్రం : రాజాధిరాజు (1980)
రచన : వేటూరి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి.సుశీల

Wednesday, December 22, 2010

Saptapadi - rEpalliya eda jhalluna

రేపల్లియ

రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి
ఇదేనా ఆ మురళి

కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవనరాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

వేణుగాన లోలుని మురుపించిన రవళి
నటనల సరళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మువ్వల మురళి
ఇదేనా ఆ మురళి

మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనాగీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి
ఇదేనా ఆ మురళి

Kanne manasu - ye divilo virisina

ఏ దివిలో విరిసిన

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

నీ రూపమే దివ్యదీపమై
నీ నవ్వులే నవ్యతారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే

పాలబుగ్గలను లేతసిగ్గులో పల్లవించగా రావే
నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే

నిదురమబ్బులను మెరుపుతీగవై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే

Gautam SSC - edo asha

ఏదో ఆశ

ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది
నిజం తెలుసా ఈనాటిది కాదది ఇపుడే మేలుకున్నది
ఇలా నీ శ్వాస గిల్లి లెమ్మంటూ నన్నల్లుకుంది నిశీధిలో ఉషోదయంలా

నీ లాలిని పాడే లాలన నేనోయ్
జాబిలికై ఆశ పడే బాలను నేను
తల్లిగా జోకొట్టి చలువే పంచాలోయ్
చెల్లిగా చేపట్టి చనువే పంచాలోయ్
సరిగా నాకే ఇంకా తేలని ఈవేళ

నీ నీలి కనుల్లో వెతుకుతు ఉన్నా
క్షణానికో రూపంలో కనబడుతున్నా
జాడవై నావెంట నిను నడిపించాలోయ్
జానకై జన్మంతా జంటగా నడవాలోయ్
తెలిసీ తెలీనట్టే ఉందీ ఈ లీల

Money - Chakravartiki

చక్రవర్తికీ

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐనా అన్నీ అంది మనీ మనీ
పచ్చనోటుతో లైఫు లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టడానికి పాడెకట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబ్డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా

ఇంటద్దె కట్టావ నా తండ్రి నో ఎంట్రీ విధి వాకిట్లో
దొంగల్లే దూరాలి సైలెట్లీ నీ ఇంట్లో చిమ్మచీకట్లో
అందుకే పదా బ్రదర్ మనీ వేటకీ
అప్పుకే పదా బ్రదర్ ప్రతీ పూటకీ
రోటీ కప్డా రూము అన్నీ రూపీ రూపాలే
సొమ్ముని శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా

ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా
డ్రీమించుకొవచ్చు ధీమాగా డ్రామాలో ప్రేమస్టోరీలా
పార్కులో కనే కలే ఖరీదైనది
బ్లాకులో కొనే వెలే సినీప్రేమది
చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికులెవ్వరికీ
జీవితం ప్రతినిమిషము సొమ్మిచ్చిపుచ్చుకొరా

డబ్బురా డబ్బుడబ్బురా డబ్బు డబ్బే డబ్బు డబ్బురా

Vedam - Malli Puttanee

మళ్లీ పుట్టనీ
ఉప్పొంగిన సంద్రంలా
ఉవ్వెత్తున ఎగిసింది
మనసును కడగాలనే ఆశ
కొడిగట్టే దీపంలా
మిణుకు మిణుకు మంటోంది
మనిషిగ బతకాలనే ఆశ
గుండెల్లో ఊపిరై
కళ్ళల్లో జీవమై
ప్రాణమై ప్రాణమై
మళ్లీ పుట్టనీ నాలో మనిషిని

చిత్రం : ఆరెంజ్ (2010)రచన : వనమాలి సంగీతం : హారిస్ జయరాజ్ గానం : షాహిల్ హడ, చిన్మయి

పల్లవి :
వువా వువా హూ... అహూ... అహూ...
రూబా రూబా హే రూబా రూబా
రూపం చూస్తే హాయిరబ్బా
తౌబా తౌబా హే తౌబా తౌబా
తూ హై మేరీ మెహబూబా
అయ్యయ్యయ్యో...
ఏం హాయే నీ వెంట తరుముతోందే
ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోందే
సంతోషంలో ఈ నిమిషం
పిచ్చెక్కినట్టుగుందే
రూబ రూబా రూ...

చరణం : 1
ఇంచు దూరమే అడ్డున్నా
ఎలావుండగలవంటుంది
నిన్ను తాకమని తొందర చేసే నా మదే
కొంటె చేష్టలే చేస్తున్నా
తనేం చేసినా కాదనదే
ఎంతసేపు కలిసున్నా ఆశే తీరదే
ఓ... ఈ ఆనందంలో
సదా ఉండాలనుందే
ఆ మైకంలోనే మదే ఊరేగుతోందే
నీతో సాగే ఈ పయనం
ఆగేనా ఇక ఏ నిమిషం
చరణం : 2
రెక్కలొచ్చిన ట్టుటుందే
మదే తేలిపోతుంటుందే
రేయి పగలు మాట్లాడేస్తున్నా చాలదే
నవ్వు నాకు తెగ నచ్చిందే
నడుస్తున్న కళ నచ్చిందే
నిన్ను వీడి ఏ వైపుకు అడుగే సాగదే
ఓ... నువ్వేమంటున్నా
వినాలనిపిస్తు ఉందే
రోజూ నీ ఊసే కలల్నే పంచుతోందే
నీతో ఉండే సంతోషం
కాదా నిత్యం నా సొంతం

చిత్రం : ఆరెంజ్ (2010)
రచన : వనమాలి
సంగీతం : హారిస్ జయరాజ్
గానం : షాహిల్ హడ, చిన్మయి

Wednesday, December 15, 2010

‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రం కోసం 1966 డిసెంబరు 15న (ఇదే రోజు) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడిన మొదటిపాట రికార్డింగ్ జరిగింది.

పల్లవి : నా పేరు బికారి నా దారి ఎడారి
మనసైన చోట మజిలీ
కాదన్న చాలు బదిలీ
నా దారి ఎడారి నా పేరు బికారి (2)

చరణం : 1
తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను
పాట నాకు సైదోడు పక్షి నాకు తోడు
విసుగు రాదు ఖుషీ పోదు
వేసట లేనేలేదు (2)
అసలు నా మరోపేరు ఆనంద విహారి ॥దారి॥

చరణం : 2
మేలుకొని కలలుగని మేఘాల మేడపై
మెరుపుతీగలాంటి
నా ప్రేయసినూహించుకొని
ఇంద్రధనసు పల్లకీ ఎక్కి
కలుసుకోవాలని (2)
ఆకాశవీధిలో పయనించు బాటసారి ॥దారి॥

చరణం : 3
కూటికి నే పేదను
గుణములలో పెద్దను
కూటికి నే పేదను
గుణములలో పెద్దను
సంక ల్పం నాకు ధనము
సాహసమే నాకు బలం
ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు
ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు
అంతవరకు నేనొక నిరంతర సంచారి ॥దారి॥

చిత్రం : శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ (1976)
(దర్శకత్వం : బాపు)
రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

గమనిక : ఎస్.పి.కోదండపాణి స్వరకల్పనలో ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రం కోసం 1966 డిసెంబరు 15న (ఇదే రోజు) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడిన మొదటిపాట రికార్డింగ్ జరిగింది.

Tuesday, December 14, 2010

NIDARE KALA AINADI(SURYA SON OF KRISHNAN)

నిదరే కల అయినది..కలయే నిజమైనది..
బతకే జత అయినది..జతయే అతనన్నది..
మనసేమో ఆగదు..క్షణమైన తోచదు..
మొదలాయే కథే ఇలా..(2)

వయసంతా వసంత గాలి
మనసనుకో మమతనుకో
ఎదురైనది ఎడారి దారి..
చిగురులతో చిలుకలతో..
యమునకొకే సంగమమే
కడలినది కలవదులే..
హృదయమిలా అంకితమై
నిలిచినది తనకొరకే
పడిన ముడి పడచు ఒడి
ఎదలో చిరు మువ్వల సవ్వడి(నిదురే)

అభిమానం అనేది మౌనం
పెదవులపై పలుకదులే..
అనురాగం అనే
సరాగంస్వరములకే దొరకదులే
నిను కలిసిన క్షణమే
చిగురించే మధుమురళి..
నిను తగిలిన ఈ తనువే
పులకరించే ఎద రగిలి..
ఎదుట పడి కుదుట పడే
మమకారపు నివాళిలేఇది(నిదురే)

MONNA KANIPINCHAVU(SURYA SON OF KRISHNAN)

మొన్న కనిపించావు మైమరచిపోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే..
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన
ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా
ఊరంతా చూసేలా అవుదాం జత

త్రాసులో నిన్నే పెట్టి
తూకానికి పుత్తడి పెడితే
తులాభారం తూగేది ప్రేయసికే
ముఖం చూసి పలికే వేళ
భలే ప్రేమ చూసిన నేను
హత్తుకోకపోతానా అందగాడా
ఓ..నీడవోలె వెంబడి ఉంటా
తోడుగా చెలి
పోగవోలె పరుగున వస్తా
తాకనే చెలి
వేడుకవో కలవో నువ్వు
వింతవో చెలి..(మొన్న)

కడలి నేల పొంగే అందం
అలలు వచ్చి తాకే తీరం
మనసు జిల్లుమంటుందే ఈ వేళలో
తల వాల్చి ఎడమిచ్చావే
వేళ్ళు వేళ్ళు కలిపేసావే
పెదవికి పెదవి దూరమెందుకే
పగటి కలలు కన్నా నిన్ను
కునుకు లేకనే
హృదయమంత నిన్నే కన్నా
దరికి రాకనే
నువ్వు లేక నాకు లేదు
లోకమన్నది(మొన్న)

NALONE PONGENU NRMADA(SURYA SON OF KRISHNAN)

నాలోనే పొంగెను నర్మాదా
నీళ్ళల్లో మురిసిన తామరా
అంతట్లో మారెను ఋతువులా
పిల్లా నీవల్ల....నీతో పొంగే వెల్లువా
నేళ్ళల్లో ఈదిన తారకా
బంగారు పూవుల కానుక
పేరేలే కాంచనా
ఓం శాంతి శాంతి ఓం శాంతి
నా ప్రాణం సర్వం నీవేలే
నా శ్వాసే నీవే దోచావే
చెలిమేనే నీవు అయ్యావే(నాలోనే)
ఏదో ఒకటి నన్ను తలచి
ముక్కు చివరా మర్మమొకటి
కల్లాకపటం కరిగిపోయే
మూసినవ్వా భోగామెల్లా
నువ్వు నిలిచిన చోటేదో వెల ఎంత పలికెనో
నువ్వు నడిచే బాటంతా మంచల్లె అయ్యేనో
నాతోటి రా ఇంటి వరకు నా ఇల్లే చూసి
నన్ను మెచ్చు ఈమె ఎవరో ఎవరో తెలియకనే
వెనకే నీడై పోవొద్దే
ఇది కలయో నిజమో ఏమ్మాయో
నా మనసే నీకు వశమాయే...వశమాయే(నాలోనే)
కంటి నిద్రే దోచుకెళ్ళా్....దోచుకెళ్ళా్
ఆశలన్నీ జల్లివెళ్ళావ్
నిన్ను దాటిపోతువుంటే....పోతువుంటే
వీచే గాలి దిశలు మారు
ఆగంటూ నీవంటే నా కాళ్ళే ఆగేనే
నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు
కౌగిలింత కోరలేదు కోరితే కౌగిలి కాదు
నా జీవన సర్వం నీతోనే
నను తలచే నిమిషం ఇదియేనే
నువ్వు లేవో లేవు అనకుంటే
నా హృదయం తట్టుకోలేదే.....(నాలోనే)

SUSWAGATAM NAVARAGAMAA(SUSWAGATAM)

సుస్వాగతం నవరాగామా
పలికిందిలే ఎద సరిగమ
ప్రియ దరహాసమా ప్రేమ ఇతిహాసమా
నీ తొలి స్పర్శలో ఇంత సుఖ మైకమా
ఇది ప్రణయాలు చిగురించు శుభ తరుణమా

(చిన్నారి రాణి పువ్వా చిన్ని చిన్ని నవ్వులివ్వ
నీ కోసం ప్రాణం పెట్టె చిన్నవాణ్ణి చేరవా)

అంతేలేని వేగంతోనే ప్రేమే వస్తుంటే
నేను ఆనకట్ట వేయలేనే ఆహ్వానిస్తుంటే
పట్టే తప్పే విరహంలోనే మునిగిపోతుంటే
ఇంక క్షేమంగానే జీవిస్తా నీ చెయ్యందిస్తుంటే
చేతులే నీకు పూల దండగా
మెడలోన వేసి నీ జంట చేరనా
నా చూపు సూత్రంగా ముడిపడగా
నాజూకు చిత్రాల రాజ్యమేలనా
మౌనమే మాని గానమై పలికే నా భావన

(శిలలాంటి గుండె కోసం శిల్పమల్లె మారిపోయే
చిత్రాల ప్రేమ చోద్యం చక్కనైన వేళల్లో)

సూరిడున్నాడమ్మ నిన్నే చూపడానికి
రేయి వున్నాదమ్మ కలలో నిన్నే చేరడానికి
మాట మనసు సిద్దం నీకే ఇవ్వడానికి
నా కళ్ళు,పెదవి ఉన్నాయ్ నీతో నవ్వడానికి
ఏనాడో చూశాను రూపు రేఖలు
ఆనాడే రాశాను చూపు లేఖలు
రోజు లేవమ్మ ఇన్ని వింతలు
వేళ నా ముందు ప్రేమ పుంతలు
ఏడు వింతలను మించే వింత మన ప్రేమే సుమా

(వచ్చింది పూలమాసం చిన్నవాడి ప్రేమకోసం
అందాల నీలాకాశం అందం చందం సంబరం)

JOLAJOLAMMAJOLA(SUTHRADHARULU)

జోలాజోలమ్మజోల జేజేల జోల జేజేల జోల
నీలాల కన్నులకు ఇచ్చమల్లె పూల జోల(2) (2)
...........హాయి హాయి...................


రేపల్లె గోపన్న రేపు మరచి నిదరోయే
యాదగిరి నరసన్న ఆదమరచి నిదరోయే
ఏడు కొండల ఎంకన్న ఎపుడనగా నిదరోయే{2}
కోడెపిల్లడా నీకేమో కునుకైనా రాదాయే..కునకైన..ఛి
............హాయి......................


మీనావతారమెత్తి మేని చుట్టూ రాబోకురా
..................................
క్రిష్ణావతారమెత్తి కోకలెత్తుకుపోబోకురా
..................................
రావణావతారమెత్త్తి వామనావతారమెత్తి స్వామిలాగ అయిపోకు
బుద్ధావతారమెత్తి బోధి చెట్టును అంటి వుండకు
రఘు వంశ తిలకుడివై రాముడివై రమణుడివై
సీతతోనే వుండిపోరా గీత నువ్వే దిద్దిపోరా
ఈ సీతతోనే వుండిపోరా నా గీత నువ్వే దిద్దిపోరా..

GHALLU GHALLU(SWARNA KAMALAM)

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లె తుళ్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు….(2)
పల్లవించనీ నేలకు పచని పరవళ్ళు
ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లె తుళ్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
ఎల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు(2)
ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు………(ఘల్లు)

లయకే నిలయమై నీ పాదం సాగాలి ఆహాహహహహః
మలయా నిలగాతిలో సుమ బాలగ తూగాలి ఆహాహహహహః
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేడి
తిరిగే కాలానికి………..ఆఆఆఆఅ……..
తిరిగే కాలానికి తీరొకటుంది….
అది నీ పాఠానికి దొరకను అంది
నటరాజ స్వామి ఝటాఝూటిలోకి చేరకుంటే
విరుచుకు పడు సుర గంగకు విలువేముంది……..(2)

దూకే అలలకు ఏ తాళం వేస్తారు
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్దం…..
వద్దని ఆపలేరు………ఆఆ……….
వద్దని ఆపలేరు ఉరికే ఊహని..
హద్దులు దాటరాదు ఆశల వాహిని
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే విరివనముల
పరిమళముల విలువేముంది(2)

KOLUVAI VUNNADE(SWARNA KAMALAM)

కంటేనాలంబయేత్ గీతం
హస్తేనా అర్ధం ప్రదర్శయేత్
చక్షుభ్యాం దర్శయేత్ భావం
పాదాభ్యాం తలం ఆచరేత్

కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే(2)
వలరాజు పగవాడే
వనిత మోహనాంగుడే(2)
కొలువై ఉన్నాడే

పలు పొంకమగు చిలువల
కంకణములమర
నలు వంకల మణిరుచులవంక తనర(౩)
తలవంకనలవేలు
తలవంకనలవేలు కులవంక నెలవంక(2)
వలచేత నొసగింక వైఖరి మీరంగ
కొలువై ఉన్నాడే...........

మేలుగా రతనంపు రాలు చెక్కిన ఉంగరాలు
భుజగ కేయూరాలు మెరయంగ(2)
పాలు గారు మోమున శ్రీలు పోదామా(2)
పులి తోలు గట్టి ముమ్మొన
వాలు బట్టి చెదర
కొలువై ఉన్నాడే......

TELI MANCHU KARIGINDI(SWATHI KIRANAM)

తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ…….
ఇల గొంతు వణికింది పిలుపునీయనా ప్రభూ…..(2)
ఈ దోవ పొడవునా కువకువల స్వాగతము
నీ కాలి అలికిడికి మెలకువల వందనము

ఈ పూల రాగాల పులకింత గమకాలు

గారాబు కవనాల గాలి సంగతులు(2)
నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు
పల్లవించును ప్రభూ పవళించు భువనాలు
భాను ముర్తీ నీ ప్రాణ కీర్తన విని
పలుకనీ ప్రణతులని ప్రణవ శ్రుతిని
పాడనీ ప్రకృతిని ప్రధమ కృతిని

భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు

నీ రాజసానికవీ నీరాజనాలు(2)
పసరు పవనాలలో పసికూన రాగాలు
పసిడి కిరణాల పడి పదునుదేరిన చాలు
తలయూచు తలిరాకు బహుపరాకులు విని
దొరలనీ దోర నగవు దొంతరనీ
తరలనీ దరి తొలగి రాతిరినీ...

SHRUTHI NEEVU GATHI NEEVU(SWATHI KIRANAM)

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
ఈ నా కృతి నీవు భారతి
ఈ నా కృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
ద్రుతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతి
ద్రుతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతి
శరణా గతి నీవు భారతి

నీ పదములొత్తిన పథము ఈ పథము నిత్యకైవల్య పథము
నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు
కోరినా మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప
చేరినా ఇక చేరు ఉన్నతేది నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప

శ్రీ నాధ కవి నాధ శృంగార కవితా తరంగాలు నీ స్పూర్తులే
అల అన్నమాచర్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే
శ్రీ నాధ కవి నాధ శృంగార కవితా తరంగాలు నీ స్పూర్తులే….
అల అన్నమాచర్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే
త్యాగయ్య గళసీమ రావిల్లిన అనంత రాగాలు నీ మూర్తులే
నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం జననీ భవతారక మంత్రాక్షరం

PRANATHI PRANATHI(SWATHI KIRANAM)

సా రే గ మా ప మా గ మా స రే ని రి స
ప మా గ మా స రి
సా రి గ మా ప ని స ని ప మా గ మా స రి రి సా
ప్రణతి ప్రణతి ప్రణతి
ప మా ప మా గ మా స రే సా
ప్రణతి ప్రణతి ప్రణతి
ప్రణవ నాద జగతికి
పమప మామప మా ప నీ
ప్రణుతి ప్రణుతి ప్రణుతి
ప్రధమ కళా సృష్టికి

పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై సుఖపికాది కలరవం ఐంకారమా
పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై సుఖపికాది కలరవం ఐంకారమా
పైరు పాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి హ్రీంకారమా హ్రీంకారమా
గిరుల శిరసులను జారే ఝరుల నాదాల వడి అలజడి శ్రీంకారమా శ్రీంకారమా
ఆ బీజాక్షర విగతికి అర్పించే ద్యోతలివే

పంచ భూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన అది కవనమా
మా గ మా పా ప మా పా పా ప ప ప
నిపపాప నిపపాప నిపాపపమా
గ ప మా ప మా గా
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేళనా అది నటనమా అది నటనమా
కంటి తుదల హరివింటి పొదల తళుకందిన సవర్ణ లేఖనా అది చిత్రమా అది చిత్రమా
మౌన శిలల చైతన్య మూర్తులుగా మలచిన సజీవ కల్పనా అది శిల్పమా అది శిల్పమా
ఆ లలితా కళల సృష్టికి అర్పించే ద్యోతలివే

SANGEETHA SAHITHYA(SWATHI KIRANAM)

ఆఆఆఆఆఆఆ………..
రిగామప దనిస నిదమప గరిసరి ఆ…………….
సంగీత సాహిత్య సమలంక్రుతే సంగీత సాహిత్య సమలంక్రుతే
స్వర రాగ పదయోగ సమభూషితే
ఏ భారతి మనసా స్మరామి ఏ భారతి మనసా స్మరామి
శ్రీ భారతి శిరసా నమామి శ్రీ భారతి శిరసా నమామి

వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
నాద నాదంత పరివేషిని ఆత్మా సంభాషిని
వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
నాద నాదంత పరివేషిని ఆత్మ సంభాషిని
వ్యాస వాల్మీకి వాగ్ధాయిని
వ్యాస వాల్మీకి వాగ్ధాయిని జ్ఞ్యానవల్లి సవుల్లాసిని

బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
భవ్య భలకారిణి
నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిని
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
భవ్య భలకారిణి
నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిని
సకల సుఖలాసమున్వేషిణి
సకల సుఖలాసమున్వేషిణి సర్వ రస భావ సందీపిని

SHIVAANII BHAVANII(SWATHI KIRANAM)

శివానీ....భవానీ...శర్వాణీ....
గిరినందిని శివరంజని
భవ భంజని జననీ(2)
శతవిధాల శృతి విధాన స్తుతులు
సలుపలేని నీ సుతుడనే శివానీ...
శివానీ....భవానీ...శర్వనీ....

శృంగారం తరంగించు
సౌందర్యలహరివని...ఆ....(2)
శాంతం మూర్తీభవించు
శివానందలహరివని....ఆ...(2)
కరుణ చిలుకు సిరినగవుల
కనకదారవీవనీ
నీ దరహాసమే దాసుల
దరిజేర్చే దారియని
శతవిధాల శృతి విధాన స్తుతులు
సలుపలేని నీ సుతుడనే శివానీ
శివానీ....భవానీ..శర్వాణీ...

రౌద్రవీర రసోద్రిక్త భధ్రకాళివీవనీ
భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ(రౌద్ర వీర)
భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ
భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ...
అద్భుతమౌ అతులితమౌ
లీల జూపినావనీ....(గిరినందిని)

SUVVI SUVVU SUVVALAMMA(SWATIMUTYAM)

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
చాల బాగా పాడుతున్నారే
ఆ..పై షడ్జమం ఆ మందరం
ఆ..ఆ..ఆ..
చూడండి..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
నిసరిమ పనిసరి నిరిరిస నిపమపనిసా
నిపమరిమరి నీసా
తానననా..తానాన..
తదరి..నా..ఆ..
సువ్వి సువ్వి సువ్వాలమ్మ..
సీతాలమ్మ..
గువ్వ మువ్వ సవ్వడల్లె నవ్వాలమ్మ(సువ్వి)

అండ దండ ఉండాలని
కోదండరాముని నమ్ముకుంటే(2)
గుండేలేని మనిషల్లే
నిను కొండ కోనలకొదిలేసాడా
గుండేలేని మనిషల్లే(గుండె)
అగ్గిలోన దూకి
పువ్వు మొగ్గలాగ తేలిన నువ్వు
నేగ్గేవమ్మ ఒక నాడు నింగి నేల నీ తోడు(2)
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వి(సువ్వి)

చుట్టూ ఉన్న చెట్టు చేమ
తోబుట్టువులింక నీకమ్మ(2)
ఆగక పొంగే కన్నీళ్ళే
నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా(2)
పట్టిన గ్రహణం విడిచి
నీ బతుకున పున్నమి పండే ఘడియ
వస్తుందమ్మ ఒకనాడు
చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆనాడు?
చుస్తాడా ఆ పైవాడు?
సువ్వి సువ్వి సువ్వి..

LALI LALI LALI(SWATIMUTYAM)

లాలీ లాలీ లాలీ లాలీ....(2)
వటపత్రశాయికి వరహాల లాలీ
రాజీవనేత్రునికి రతనాల లాలీ(వటపత్ర)
మురిపాల కృష్ణునికి......... మురిపాల కృష్ణునికి ముత్యాల లాలీ
జగమేలు స్వామికి పగడాల లాలీ(వటపత్ర) లాలీ లాలీ లాలీ లాలీ....
కళ్యాణ రామునికి కౌసల్య లాలీ(2) యదువంశ విభునికి యశోద లాలీ(2) కరిరాజ ముఖునికి... కరిరాజ ముఖునికి గిరి తనయ లాలీ() పరమాంశభవునికి పరమాత్మ లాలీ(వటపత్ర)
జోజో జోజో జో....(2) అలమేలుపతికి అన్నమయ్య లాలీ(2) కోదండరామునికి గోపయ్య లాలీ(2) శ్యామలాంగునికి శ్యామయ్య లాలీ() ఆగమనుతునికి త్యాగయ్య లాలీ(వటపత్ర) లాలీ లాలీ లాలీ లాలీ....()

SIGGU PU BANTHI(SWAYAM KRUSHI)

సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి (2)
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా
రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా

విరజాజి పూల బంతి అర చేత మోయలేని
సుకుమారి ఈ సిన్నదేనా శివుని విల్లు మోసిన జాణ ఈ సిన్నదేనా
ఔరా అని రామయ కన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు
సూసి అలకలొచ్చిన కలికి ఏసినది కులుకుల మెలికి

సిరసొంచి కూరుసున్న గురిసూసి సేరుతున్న(2)
సిలకమ్మ కొన సూపు సౌరు బొండు మల్లె చెండు జోరు
సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ్య రూపు(2)
మెరిసే నల్ల మబ్బైనాది వలపు జల్లు వరదైనాది

MARALA TELUPANA(SWAYAMVARAM)

ఆ..మపమపరి రిమరిమస ఆ..
మరల తెలుపనా ప్రియా..
మరల తెలుపనా(2)
ఎదలోయల దాచుకున్న
మధురోహల పరిమళాన్ని(2)
కనుపాపలు నింపుకున్న
చిరునవ్వుల పరిచయాన్ని(మరల)

విరబూసిన వెన్నెలలో
తెరతీసిన బిడియాలని(2)
ఆణువణువూ అల్లుకున్న
అంతులేని విరహాలని(2)
నిదురపోని కన్నులలో
పవళించు ఆశలని
చెప్పలేక చేతకాక
మనసు పడే తడబాటుని..(మరల)

నిన్న లేని భావమేదో
కనులు తెరిచి కలయచూసి(2)
మాటరాని మౌనమేదో
పెదవి మీద ఒదిగిపోయే(2)
ఒక క్షణమే ఆవేదన
మరు క్షణమే ఆరాధన
తెలియరాక తెలుపలేక
మనసు పడే మధుర బాధ(మరల)

NALUGURIKI NACHINADI(TAKKARIDONGA)

నలుగురికీ నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది రూట్లో నే నడిచెదరో(నలుగురికి) పొగరని అందరు అన్నా అది మాత్రం నా నైజం
తెగువని కొందరు అన్నా అది నాలో మానరిజం
నిండు చందురుడు ఒక వైపు చుక్కలు ఒక వైపు
నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు(నిండు)(నలుగురి)
నువ్వు నిలబడి నీళ్ళు తాగడం nothing special
పరుగులెత్తుతూ పాలు తాగడం something special
నిన్ను అడిగితే నిజం చెప్పడం nothing special
అప్పుడప్పుడు తప్పు చెప్పడం something special
లేనివాడికి దానమివ్వడం nothing special
లేనివాడికి దానమివ్వడం nothing special
ఉన్నవాడిని దోచుకెళ్ళడం something special(నలుగురి)
బుద్దిమంతుడి బ్రాండ్ దక్కడం nothing special
పోకిరోడిలా పేరుకెక్కడం something special
రాజ మార్గమున ముందుకెళ్ళడం nothing special
దొడ్డి దారిలో దూసుకెళ్ళడం something special
హాయి కలిగితే నవ్వు చిందడం nothing special(2) బాధ కలిగినా నవ్వుతుండడం something special

KANNULU RENDU KALAVARAPADUTUNTE(10TH CLASS)

కన్నులు రెండు కలవరపడుతుంటే
గుండెల సవ్వడి గుసగుసమంటుంటే
నాలో ప్రతి ఆశ నాలో ప్రతి శ్వాస
నాలో ప్రతి ఆశ నువ్వే కావాలంటే
రోజు కనుపాప నిన్నే చూడాలంటే
ప్రేమేనంటావా..(2)(కన్నులు)
గాలి తెమ్మెర వస్తున్నా
పరిమళాల స్వరాలుగా
రాక నీదే అంటున్నా.. పాట పల్లవి వింటున్నా
పరవశాన చటుక్కున
పాట నీదే అంటున్నా
ఎమైనదేమో నాలోన ఎద లోలోన
గోదారిగాని పొంగేనా
ఈరోజే నేనూ వింటున్నా
మది ఆలపించే ప్రేమ కీర్తన
నే వెంట నీడై వస్తున్నా
పరిచయాలు వరాలుగా
నీ తీపి కలలే కంటున్నా
రోజు పని చేస్తున్నా
క్షణాలు యుగాలుగా
నీ ఊహలోనే ఉంటున్నా
మాయ అంతా నీదేనా తొలి ప్రేమేనా
నీలోన కూడా ఇంతేనా
హాయి అంతా ప్రేమేనా
మహా బాగుందయ్యా మూగ వేదన

ABHINANDANA MANDAARA MALA(THANDRA PAPARAYUDU)

అభినందన మందార మాల(౩)
అధినాయక స్వాగత వేళ
అభినందన మందార మాల

స్త్రీ జాతికి ఏ నాటికి
స్మరణీయ మహనీయ వీరాంగనికి
అభినందన మందార మాల

వేయి వేణువులు నిన్నే పిలువగా
నీ పిలుపు నా వైపు పయనించెనా(2)
వెన్నెల కన్నెలు నిన్నే చూడగా(2)
నీ చూపు నా రూపు వరియించెనా
నా గుండెపై నీవుండగా
దివి తానె భువి పైనే దిగి వచ్చెనా

అభినందన మందార మాల
అలివేణి స్వాగత వేళ అభినందన మందార మాల
సౌందర్యము సౌశీల్యము
నిలువెల్లా నెలకొన్న కలభాషిణికి
అభినందన మందార మాల

వెండి కొండపై వెలసిన దేవర
నెలవంక మెరిసింది నీ కరుణలో(2)
సగము మేనిలో ఒదిగిన దేవత(2)
నీ సిగ్గు తొణికింది నీ తనువులో(2)
ప్రియ భావమే లయ రూపమై
అలలెత్తి ఆడింది అణువణువులో
అభినందన మందార మాల
ఉభయాత్మల సంగమ వేళా
అభినందన మందార మాల

OO BANGARU RANGULA CHILAKA(THOTA RAMUDU)

బంగారు రంగుల చిలకా పలకవే.. అల్లరి చూపుల రాజా ఏమనీ.. నా మీద ప్రేమే వుందని.. నా పైన అలకే లేదని.... అల్లరి చూపుల రాజా పలకవా
బంగారు రంగుల చిలకా ఏమనీ.. నా మీద ప్రేమే వుందని... నా పైన అలకే లేదని...
పంజరాన్ని దాటుకుని బంధనాలు తెంచుకుని
నీకోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలచావెందుకే.. నీ చేరువలో నీ చేతులలో
పులకించేటందుకే( బంగారు రంగుల)
సన్నజాజి తీగుంది తీగమీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే
కొండల్లో కోనల్లో
మనకెదురే లేదులే......( అల్లరి చూపుల)