చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే (2)

రాగం వేణువూదె నే
మేఘం మురిసి పాడెనే
కరుకైన గుండెలో చిరుజల్లు కురిసెనే
తనవారి పిలుపుతో
ఆశలు వెల్లువాయెనే
ఊహలు ఊయలూపెనే ॥
చినుకు రాక చూసి మది చిందులేసెనే
చిలిపి తాళమేసి చెలరేగి పోయెనే
॥
చరణం : 1
తుళ్ళుతున్న చిన్ని సెలయేరు
గుండెలోన పొంగి పొలమారు
అల్లుకున్న ఈ బంధమంతా
వెల్లువైనది లోగిలంతా
పట్టెడన్నమిచ్చి పులకించే
నేల తల్లి వంటి మనసల్లే
కొందరికే హృదయముంది
నీకొరకే లోకముంది
నీకు తోడు ఎవరంటూ లేరు గతములో
నేడు చెలిమి చెయి చాపే
వారే బ్రతుకులో
కలిసిన బంధం కరిగిపోదులే
మురళి మోవి విరిని తావి కలిసిన వేళ
॥
చరణం : 2
మనసున వింత ఆకాశం
మెరుపులు చిందె మనకోసం
తారలకే తళుకు బెళుకా
ప్రతి మలుపూ ఎవరికెరుక
విరిసిన ప్రతి పూదోట
కోవెల ఒడి చేరేనా
ఋణమేదో మిగిలి ఉంది
ఆ తపనే తరుముతోంది
రోజూ ఊయలే ఊగే రాగం గొంతులో
ఏవో పదములే పాడే మోహం గుండెలో
ఏనాడూ తోడు లేకనే
కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే
॥
చిత్రం : శివపుత్రుడు (2004)
రచన : వనమాలి
సంగీతం : ఇళయరాజా
గానం : ఆర్.పి.పట్నాయక్
No comments:
Post a Comment