పల్లవి : ![]() నాకీవేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుంటే ఏమౌతానో నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా కాదంటే నామీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా ఒకసారి చూసి నే వలచానా నను వీడి పోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా నా ప్రేమ లోతులో మునిగాకా నువు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తావేకంగా ఓ... చరణం : 1 నిజాయితీ ఉన్నోడిని నిజాలనే అన్నోడిని అబద్ధమే రుచించని అబ్బాయినీ ఒకే ఒక మంచోడిని రొమాన్స్‌లో పిచ్చోడిని పర్లేదులే ఒప్పేసుకో సరేననీ ముసుకేసుకోదు ఏనాడు నా మనసే ఓ భామ నను నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమా చరణం : 2 తిలోత్తమా తిలోత్తమా ప్రతిక్షణం విరోధమా ఇవ్వాళ నా ప్రపంచమే నువ్వే సుమా ఓ... గ్రహాలకే వలేసిన దివే అలా దిగొచ్చినా ఇలాంటి ఓ మగాడినే చూళ్లేవమ్మా ఒకనాటి తాజ్మహలైనా నా ముందు పూరిల్లే ఇక పైన గొప్ప ప్రేమికుడై లోకంలో నిలిచే పేరే నాదేలే... ఓ... చిత్రం : ఆరెంజ్ (2010) రచన : వనమాలి సంగీతం : హారీస్ జయరాజ్ గానం : నరేష్ అయ్యర్ అడిషినల్ వాయిస్ : నదీష, యూవి జాకీ |
Friday, December 10, 2010
చిత్రం : ఆరెంజ్ (2010) రచన : వనమాలి సంగీతం : హారీస్ జయరాజ్ గానం : నరేష్ అయ్యర్ అడిషినల్ వాయిస్ : నదీష, యూవి జాకీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment