Wednesday, December 8, 2010

చిత్రం : శుభప్రదం (2010) shubapradam telugu movie telugu songs lyrics 2010

పల్లవి :
తప్పెట్లోయ్ తాళాలోయ్
అచ్చట్లోయ్ ముచ్చట్లోయ్
ప్రతి లోగిలి ముంగిట్లో
సిరిమువ్వల కిట్టయ మిరుమిట్లో
అట కురిసిన వెన్నెట్లో
విరబూసిన గుండెల
గలగల పదిరెట్లోయ్
నలుదిక్కుల చీకటినంతా
తన మేనిలో దాచిన వింత
కడువిందుగ వెలుగులు చిందెను
మా కన్నుల్లో
ఆ నందముకుందుని చేత
ఆంతర్యము అణువణువంతా
మధునందనమాయెను తన్మయ
తారంగంలో ॥

చరణం : 1
స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా
మధురాపురి సదన మృదువదన
మధుసూదన
తలపైన కన్నున్న ముక్కంటి తానేగా
శివమూర్తి శిఖిపింఛ మౌళి
ప్రాణాలు వెలిగించు ప్రణవార్థమేగా
తన మోవి మురళీ స్వరాళి
భవుని మేని ధూళి
తలపించదా వన మధూళి
ప్రమథగణ విరాగి యదు కాంతలకు
ప్రియ విరాళి
ఝణన ఝణన
పదయుగళమై జతపడే
శివకేశవాభేదకేళి ॥

చరణం : 2
ముద్దుగారే యశోద
ముంగిట ముత్యము నేను
ముద్దుగోరే రాధమ్మ సందిట
చెంగల్వ పూదండ నేను
చెలిమికోరే... చెలిమికోరే గోపెమ్మల
చేతవె న్నముద్ద నేను
నన్నుకోరే ఎవ్వరికైనా
బంధుగోవిందుడనౌతాను
ముద్దుగారే యశోద
ముంగిట ముత్యము నువ్వు
ముద్దుగోరే రాధమ్మ సందిట
చెంగల్వ పూదండ నువ్వు


చిత్రం : శుభప్రదం (2010)
రచన : రామజోగయ్యశాస్ర్తి
సంగీతం : మణిశర్మ
గానం : చైత్ర, బృందం

No comments: