మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు(మావయ్య)
కమ్మగా పాడనా కంటిపాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల(మావయ్య)
అరచేత పెంచాను చెల్లిని
ఈ అరుదైన బంగారు తల్లిని
అడుగేస్తే పాదాలు కందవా
నా కన్నుల్లో కన్నీళ్ళు చిందవా
అమ్మగా లాలించాడు
నిన్ను నాన్నగ పాలించాడు
అన్నగా ప్రేమించాడు అన్నీ తానైనాడు
తన ప్రాణంగా నను పెంచాడు
ఆ దైవంగా దీవించాడు
నా అన్నలాంటి అన్న ఈ లోకాన లేడు(మావయ్య)
ఆరేడు మాసాలు నిండగా
ఈ అన్నయ్య కలలన్ని పండగ
తేవాలి బంగారు ఊయల
కావాలి మా ఇల్లు కోవెల
రెప్పగా నిను కాచనా
పాపగా నిను చూడనా
రేపటి ఆశ తీరగా
నీ పాపకు జోల పాడనా
ఇది అరుదైన ఓ అన్న కధ
ఇది మురిపాల ఓ చెల్లి కధ
ఇది చెల్లెలే కాదులే నను కన్నతల్లి(మావయ్య)
MOVIE NAME: MUDDULA MAVAYYA
MUSIC DIRECTOR:K.V.MAHADEVAN
SINGERS:BALU,SUSHEELA,SHAILAJA
LYRICIST:VENNELAKANTI
No comments:
Post a Comment