ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా..
నా రెక్కల కలనాపే బలమేదీ లేదు సుమా..
పొంగే అల వస్తే తల వంచాలి..
వయసు అలలాంటిదేగా..
ప్రాయం వెనకాలే పయనించాలి..
ప్రణయం వెన్నాడి రాగా..
జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే..(2)
స రి గ రి స రి
స రి గ స రి గ రి స రి
స రి గ స రి స రి గ మా..(2)(ఏ దిక్కున)
గిరులే వణికే జలపాతం లో జోరు..
నీలో చూసా బంగారు..
ఎదిగే సొగసై ఎదురొస్తే పదహారు..
అలలై ఎగసే ఎద హోరు..
వర్ణాల విల్లు లో ఒక్కో రంగు తీసి
వయ్యారి వొంటికి పూసిందెవరు..
మనసే చెడక నిలిచే నర వరులెవరు..
జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే..(4)
మధువే తొణికే ఆధారం మధు కలశం..
మౌనం కూడా ప్రియ మంత్రం..
అప్పుడు అప్పుడు తెగి పడని ఒక ముత్యం..
వెనకే తిరిగా ప్రతి నిత్యం..
ఆ చిలక పలుకులే అలా అలా ఏరి..
నాలోని తలపులే స్వరాలు చేసి..
నీకే ఇస్తా సఖియా కవితలు కూర్చి..
జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే..(4)(ఏ దిక్కున)
No comments:
Post a Comment