Monday, December 6, 2010

PREMALEKHA RASAA(MUTYAMANTA MUDDU) telugu movie lyrics

ప్రేమలేఖ రాసా నీకంది వుంటది
పూలబాణమేసా ఎదకంది వుంటది
నీటి వెన్నెల వేడెక్కుతున్నది పిల్లగాలికే పిచ్చెక్కుతున్నది
మాఘమాసమా వేడెక్కుతున్నది మల్లెగాలికే వెర్రెక్కుతున్నది
వస్తే గిస్తే వలచి వందనాలు చేసుకుంట
హంసలేఖ పంపా నీకంది వుంటది
పూలపక్క వేసా అది వేచి వుంటది

ఆడసొగసు ఎక్కడుందో చెప్పనా
అందమైన పొడుపు కధలు విప్పనా
కోడెగాడి మనసు తీరు చెప్పనా
కొంగుచాటు కృష్ణ కధలు విప్పనా
సత్యభామ అలకలన్ని పులకరింతలే అన్నాడు ముక్కుతిమ్మన
మల్లెతోటకాడ ఎన్ని రాసలీలలో అన్నాడు భక్తపోతన
వలచి వస్తినే వసంతమాడవే
సరసమడినా క్షమించలేనురా
కృష్ణాగోదారుల్లో ఏది బెస్ట్ చెప్పమంట(హంసలేఖ)

మాఘమాస వెన్నెలెంత వెచ్చన మంచివాడివైతే నిన్ను మెచ్చనా
పంటకెదుగుతున్న పైరు పచ్చన పైటకొంగు జారకుండ నిలుచునా
సినిమాల కధలు వింటే చిత్తుకానులే చాలించు నీ కధాకళి
ఆడవారి మాటకు అర్ధాలే వేరులే అన్నాడు గ్రేటు పింగళి
అష్టపదులతో అలాగా కొట్టకు
ఇష్ఠసఖివని ఇలాగ వస్తినే
నుయ్యో గొయ్యో ఏదో అడ్డదారి చూసుకుంట(ప్రేమలేఖ)

MOVIE NAME: MUTYAMANTA MUDDU
MUSIC DIRECTOR:HAMSALEKHA
SINGERS:BALU,JANAKI
LYRICIST:VETURI

No comments: