Tuesday, December 7, 2010

ghayam 2 telugu movie telugu lyrics

పల్లవి : ఎందుకమ్మ ప్రేమ ప్రేమ
గుండెలోనె ఆగేవమ్మా రా...
సందె వేళ అయ్యిందమ్మా
సంతకాలు చెయ్యాలమ్మా రా...
వెంట వెంటనే అన్నీ అందుకోగరా
జంట వింతలే ఎన్నో చూసుకోగరా॥

చరణం : 1
నిన్ను నన్ను దూరం చేసే చెయ్యి లేదనీ
నీకు నాకు చేరువ పెంచే చూపు ఉందనీ ॥నన్ను॥
చాటుమాటులో సరసం చాలదీ పని
గోటి రాతలే కవితై నీకు తోచనీ
తెలిపేందుకు వస్తున్నా
తెలిసిందని కనుగొన్నా
కొరికేసే కల నువ్వై రారా... హహ్హా... ॥

చరణం : 2
చిన్న చోటులోనె అందే పెద్ద హాయిని
ఆడుతున్న ఇద్దరు గెలిచే వింత ఆటని ॥
పొందకుంటే ఈ మాత్రం జన్మ ఎందుకో
ఆడకుంటే ఈ ఆత్రం ఇక్కడెందుకో
అడగాలని అనుకున్నా
అటు నీ కసి కనుగొన్నా
ఇది నీదే ఇక ఏదేమైనా... హాహాహా...


చిత్రం : గాయం-2 (2010)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : ఇళయరాజా
గానం : శ్రీరామ్ పార్థసారథి, గీతా మాధురి
నిర్వహణ : నాగేష్

No comments: