Tuesday, December 7, 2010

bhangaru babu telugu movie telugu songs lyrics 1979

పల్లవి :
చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య దాని జిమ్మదియ్య
అందమంతా చీరలోనే ఉన్నది

కొంగు కొంగు కలిపి చూడమన్నది

చరణం : 1
మెరుపల్లే వచ్చింది నా ఇంటికి
నన్ను మెల్లంగ దించింది ముగ్గులోనికి

తలదాచుకొమ్మని తావిస్తివి (2)
పిల్ల దొరికింది చాలని ఇల్లాల్ని చేస్తివి

చరణం : 2
ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి
దాంతో వెర్రెత్తిపోయింది కురవ్రాడికి

పిచ్చివాడనే పేరు చాటున
మాటువేసినావు (2)
పిల్లదాని పెదవి మీద కాటువేసినావు
హాయ్... సరిసరి సరిసరి సరిసరి
సరిసరి

చరణం : 3
సరసంలో పడ్డాడు ఇన్నాళ్లకి
అబ్బో సంగీతం వచ్చింది
బుచ్చిబాబుకి

తెరచాటు తొలిగింది పరువానికి (2)
అది పరవళ్ళు తొక్కుతూ
పాడింది నేటికి
సరిసరి సరిసరి సరిసరి సరిసరి

సరసస్సస్స సగసస్సస్స
సమసస్సస్స సరి సరి సరి సా

సరి సరి సరి సా... (2)
సరి సరి సరి సరి సరి సరి సరి సా...

చిత్రం : బంగారుబాబు (1979)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల, పి.సుశీల

No comments: