Friday, December 30, 2011

చిత్రం : అన్నపూర్ణ (1960)రచన : ఆరుద్ర సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి గానం : పి.బి.శ్రీనివాస్, పి.సుశీల

పల్లవి :

మనసేమిటో తెలిసిందిలే
కనుచూపులోనే
అనురాగమంతా కనిపించెలే
మనసేమిటో తెలిసిందిలే
చిననాటి ఆశలు
ఈనాటికైనా నెరవేరెలే

చరణం : 1

ఓ... ఓ ఓహో... ఓ ఓ ఓ ఓ...
ఓ... మురిపించకే మది పులకించునే
చెలి చిరునవ్వులో సుధ చిలికించవే
ఆ... కనుమూసినా
నేను కనుతెరచినా
నీవు కనిపింతువే హాయి కలిగింతువే
ఆ... చిననాటనే ప్రేమ చిగురించెనే
ఓ... చిననాటనే ప్రేమ చిగురించెనే
ఓ... ఓ... ఓ ఓ ఓ... వికసించెనే
ఓ చెలి నీకు బిడియాలు ఇపుడెందుకే
హో చెలి నీకు బిడియాలు
ఇపుడెందుకే
మనసేమిటో తెలిసిందిలే
చిననాటి ఆశలు
ఈనాటికైనా నెరవేరెలే

చరణం : 2

ఓ... ఓ ఓహో... ఓ ఓ ఓ ఓ...
ఓ... నను చేరవే చెలి ఇటు చూడవే
నేను నిను వీడనే వీడి మనజాలనే
ఆ... నెలకొంటివి నీవు మదిలోపల
నేడు తొలిప్రేమయే నీకు చెలికానుక
ఆ... కలలన్నియు విరిసి
ఫలియించునే
ఓ... కలలన్నియు విరిసి
ఫలియించునే
ఓ ఓ ఓ నిజమౌనులే...
ఓ... చెలి మనకు ఎడబాటు
ఇక లేదులే (2)
మనసేమిటో తెలిసిందిలే
చిననాటి ఆశలు
ఈనాటికైనా నెరవేరెలే

చిత్రం : అన్నపూర్ణ (1960)
రచన : ఆరుద్ర
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
గానం : పి.బి.శ్రీనివాస్, పి.సుశీల